సవ్యసాచి ప్రీ రిలీజ్ రివ్యూ: మాస్, క్లాస్ కాంబినేషన్‌తో నాగచైతన్య.. నిధితో కెమిస్ట్రీ!
వరుస ప్లాపుల తర్వాత శైలజారెడ్డి అల్లుడు చిత్ర సక్సెస్ యువ సామ్రాట్ నాగచైతన్య అక్కినేనిలో ఓ జోష్ నింపింది. ఆ సినిమా సక్సెస్ తర్వాత నాగచైతన్య తాజాగా సవ్యసాచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రేమమ్ తర్వాత రెండోసారి జతకట్టిన నాగచైతన్, దర్శకుడు చందు మొండేటి మరో హిట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో చిత్రంలోని ప్రధాన అంశాలు మీ కోసం..

విభిన్నమైన పాయింట్‌తో
సవ్యసాచి ఓ విభిన్నమైన చిత్రంగా తెరకెక్కింది. వైద్యశాస్త్రంలోని వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే ఓ స్పెషల్ పాయింట్‌తో చిత్రం రూపొందింది. తల్లిగర్భంలో కవలలు ఉన్నట్టు గుర్తించినా.. ఒక్కరే జన్మించడాన్ని వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అని అంటారు.

వానిషింగ్ ట్వీన్ సిండ్రోమ్ అంటే
వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌తో బాధపడేవారికి ఎడమ చేయి పనిచేయదు. అయితే ఉత్సాహంగా ఉన్న సమయంలో గానీ, ఆవేశంగా ఉండే సమయంలో గానీ తన కడుపులో ఉండే మరో శిశువు కారణంగా ఎడమ చేయి పనిచేస్తుంది. కుడిచేయికి ఎంత బలం ఉంటుందో.. ఎడమ చేయికి అంతే బలం ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన అంశంతో సవ్యసాచి రూపొందింది.

ఆర్ మాధవన్ ప్రత్యేక పాత్రలో
విలక్షణమైన నటుడిగా పేరున్న ఆర్ మాధవన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. తన ప్రత్యర్థి నాగచైతన్యను మట్టుపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. ఎందుకు చైతూను చంపాలనుకొన్నదే సవ్యసాచిలో ఆసక్తికరమైన పాయింట్. ఈ సినిమా కోసం మాధవన్ చాలా శ్రద్ధపెట్టారు. సొంతంగా తెలుగు నేర్చుకొని డబ్బింగ్ కూడా చెప్పడం గమనార్హం.

తల్లి సెంటిమెంట్
సవ్యసాచి చిత్రంలో తల్లి సెంటిమెంట్ మరో అదనపు ఆకర్షణ. సాధారణంగా మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన చిత్రాలు గతంలో భారీ విజయాలను సొంతం చేసుకొన్నాయి. గర్భంలో నుంచి పుట్టని కొడుకు కోసం తల్లి పాడే ఒకరంటే ఒకరు పాట ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకొన్నది.

చైతూ, నిధి అగర్వాల్ కెమిస్ట్రీ
సవ్యసాచి మూవీతో బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ తొలిసారి తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించారు. రెండు రకాల వేరియేషన్ ఉన్న పాత్రలో నిధి కనిపిస్తారు. డీ గ్లామరైజ్ లుక్‌తోపాటు, స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా కనిపిస్తారు. చైతూ, నిధి మధ్య కెమ్రిస్ట్రీ సినిమాకు హైలెట్ అని చెప్పుకొంటున్నారు.

అర్జునుడిగా నాగచైతన్య
తొలిసారి నాగచైతన్య పౌరాణిక పాత్రలో కనిపించనున్నారు. మహాభారతంలోని అర్జునుడు గెటప్‌లో నాగచైతన్య కనువిందు చేయనున్నారు. గురువారం విడుదల చేసిన అర్జునుడి గెటప్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అర్జునుడిగా ఐదు నిమిషాలపాటు కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











