»   » ఫస్ట్ లుక్: నాగ చైతన్య ‘యుద్ధం శరణం’... సాయియికొర్రపాటి, ఎస్ఎస్ కార్తికేయ!

ఫస్ట్ లుక్: నాగ చైతన్య ‘యుద్ధం శరణం’... సాయియికొర్రపాటి, ఎస్ఎస్ కార్తికేయ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని యువ హీరో నాగ చైతన్య త్వరలో ఓ వినూత్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి 'యుద్ధం శరణం' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఆదివారం ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

'వారాహి చలనచిత్రం' బేనర్లో ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తమిళనాడుకు చెందిన కృష్ణ ఆర్‌వి మరిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇతగాడు గతంలో పలు తమిళ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ప్రతి అడుగు ఒక యుద్ధం, ప్రతి శ్వాస ఒక గెలుపు... అనే కాన్సెప్టుతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Naga Chaitanya's Yuddham Sharanam First Look

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'యుద్ధం శరణం' ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ప్రముఖ నటుడు శ్రీకాంత్ నెగెటివ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, ఆర్ట్: రామకృష్ణ, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.ఎస్. కార్తికేయ, ఎడిటింగ్: కృఫకరణ్, డైలాగులు: అబ్బూరి రవి, కథ: డేవిడ్ ఆర్ నాథన్, స్టంట్స్: స్టంట్ శివ, కింగ్ సాలమన్, కాస్టూమ్ డిజైనర్: పల్లవి సింగ్.

English summary
Naga Chaitanya next movie Yuddham Sharanam First Look released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu