వైరల్ వీడియో: సమంత, చైతు మధ్య మిర్చి గొడవ!
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ సమంత, నాగచైతన్య ప్రేమ వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఏం మాయ చేసావే చిత్రంతో మొదలైన వీరి ప్రయాణం ప్రేమగా మారి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట ప్రస్తుతం అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తాజగా సమంత, నాగచైతన్యకు సంబంధించిన యాడ్ వీడియో విడుదలయింది.
కొద్ది సేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా వ్యాపించింది. సమంత, నాగ చైతన్య కలసి చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ విడివిడిగా యాడ్స్ లో నటించారు. కానీ కలసి యాడ్ లో నటించింది లేదు. తొలిసారి ఓ సంస్థ కోసం వీరిద్దరూ యాడ్ లో నటించడం విశేషం. ఈ యాడ్ ని పెళ్లి చూపులు చిత్ర దర్శకుడు తరన్ భాస్కర్ చిత్రీకరించడం విశేషం. ఈ వీడియో సమంత, చైతు అభిమానులని తెగ ఆకట్టుకుంటోంది.
పెళ్లయ్యాక తొలిసారి కలసి సినిమాలో నటించడానికి కూడా ఈ జంట రెడీ అవుతోంది. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంపై ఇప్పటినుంచే మంచి అంచనాలు మొదలయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది.


Click it and Unblock the Notifications











