చైతూ, సమంత గురించి మరో గుడ్ న్యూస్..
అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తర్వాత సమంత మంచి జోష్‌లో ఉన్నది. పెళ్లి తర్వాత వచ్చిన రాజుగారి గది2 చిత్రం మంచి ఫలితాన్ని ఇచ్చింది. రాజుగారి గది2 రిలీజ్ తర్వాత చైతూ, సమంత లండన్‌కు హనీమూన్ ట్రిప్ కోసం వ
అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తర్వాత సమంత మంచి జోష్‌లో ఉన్నది. పెళ్లి తర్వాత వచ్చిన రాజుగారి గది2 చిత్రం మంచి ఫలితాన్ని ఇచ్చింది. రాజుగారి గది2 రిలీజ్ తర్వాత చైతూ, సమంత లండన్‌కు హనీమూన్ ట్రిప్ కోసం వెళ్లారు. తాజాగా తిరిగి వచ్చిన నేపథ్యంలోపెళ్లి విందును ఏర్పాటు చేయాలని నాగ్ అనుకొంటున్నారట.

మ్యారేజ్ రిసెప్షన్‌కు ఏర్పాట్లు
అక్టోబరు 6న గోవాలో జరిగి వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకాలేదు. అందుచేత హైదరాబాద్‌లో చైతూ, సమంత మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని అక్కినేని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. ఈ రిసెప్షన్ గురించి ఓ డేట్ కూడా అనుకొన్నట్టు సమాచారం.

చైతూ, సమంత బిజీగా
పెళ్లి తర్వాత చైతూ, సమంత తమ పనులతో బిజీగా ఉండటంతో రిసెప్షన్‌ను వెంటనే ఏర్పాటు చేయలేకపోయారు. ప్రస్తుతం వారికి వీలు కావడంతో నవంబర్ 12న రిసెప్షన్ ఏర్పాటు చేయాలని నాగార్జున భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఆ రోజు వీలుకాకపోతే నవంబర్‌లోనే ఏదో ఓ తేదీన విందును ఏర్పాటు చేయాలనుకొంటున్నట్టు తెలుస్తున్నది.

చైతూ తల్లి రిసెప్షన్
ఇటీవల చైతన్య తల్లి లక్ష్మి చెన్నైలోని తన నివాసంలో ఘనంగా రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. అత్తాకోడళ్లు ఇద్దరూ ఒకే డిజైన్ డ్రెస్‌లు ధరించి ఈ వేడుకలో ఆకట్టుకున్నారు.

సవ్యసాచిలో చైతూ.. మహానటిలో సమంత
నాగచైతన్య ప్రస్తుతం ‘సవ్యసాచి' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత చైతూ మారుతి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించనున్నారు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ‘శైలజారెడ్డి అల్లుడు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మెర్సల్ చిత్రంలో
సమంత నటించిన మెర్సల్ చిత్రం ఇటీవల రిలీజైంది. ప్రస్తుతం అలనాటి నటి సావిత్రి బయోపిక్ ‘మహానటి'లో నటిస్తున్నారు. మరో తమిళ చిత్రాన్ని కూడా అంగీకరించారు.


Click it and Unblock the Notifications











