»   » సమంత, నాగ చైతన్య ల ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్

సమంత, నాగ చైతన్య ల ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అక్కినేని కుటుంబంలో త్వరలో రెండు శుభకార్యాలు జరగబోతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ..అక్కినేని నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం మరికొన్ని రోజుల్లో నిర్వహించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 29న వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ని జరపటానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Naga Chaitanya, Samantha engagement date fixed

ఇప్పటికే ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అక్కినేని, కొణిదెల, భూపాల్‌, ప్రభు ఫ్యామిలీలతోపాటు ఇంకా పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరౌతున్నట్లు సమాచారం.అక్కినేని అఖిల్‌, శ్రియా భూపాల్‌ల నిశ్చితార్థం డిసెంబర్‌లో ఘనంగా జరిగింది. ఇటలీలో వీరి వివాహ వేడుకను నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే వారి పెళ్లెప్పుడు అనేది సినీ జనాల్లో మిస్టరీగానే ఉండిపోయింది

ఇక రీసెంట్ గా నాగార్జున రెండో కుమారుడు అఖిల్ నిశ్చితార్థం శ్రియా భూపాల్‌తో ఇటలీలో ఘనంగా జరిగింది. అయితే చైతూ కంటే చిన్నవాడైన అఖిల్ నిశ్చితార్థం ముందు జరగడంతో, అఖిల్ పెళ్లి చైతూ కంటే ముందు జరుగుతుందా లేక ఇద్దరి పెళ్లి ఒకే సారి జరుగుతుందా అనేది సినీ జనాల్లో చర్చనీయాంశంగా మారింది.

English summary
Naga Chaitanya and Samantha Ruth Prabhu, both stars in their own right, are likely to get engaged on January 29, 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu