Just In
- 10 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 10 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 11 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 12 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాగ్ తిట్టాడనే చైతూ, సమంత జంప్? రవితేజ, రానా, రకుల్, రెజీనా తోడుగా (ఫోటోస్)
హైదరాబాద్: అక్కినేని నాగ చైతన్య, సమంత కొంత కాలంగా ప్రేమలో ఉండటం త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారు స్వయంగా ప్రకటించకపోయినా అటు సమంత కొన్ని క్లూలు ఇవ్వడం ద్వారా, నాగార్జున కూడా పరోక్షంగా ఇది వాస్తవమే అని చెప్పకనే చెప్పారు.
అంతా బాగానే ఉంది కానీ నాగ చైతన్య, సమంత హైదరాబాద్ లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కంట పడటం, అదో పెద్ద ఇష్యూ కావడం, అటు పత్రికలు, న్యూస్ ఛానల్స్, వెబ్ మీడియా వీరి ఎఫైర్ గురించి రకరకాలుగా రసేయడంతో నాగార్జునకు కోపం వచ్చింది.
ఓసారి ఇద్దరినీ పిలిచి క్లాస్ పీకడంతో పాటు మీడియాతో ప్రతి సారి ఈ విషయం గురించి ఏదో ఒకటి వాగేస్తున్న సమంతను సైతం గట్టిగా మందలించాడు. దీంతో సమంత, నాగ చైతన్య ఈ మధ్య పూర్తిగా సైలెంట్ అయిపోయారు. హైదరాబాద్ లో ఇద్దరూ కలిసి బయట తిరగడం మానేసారు.
అయితే ప్రేమలో మునిగితేలుతున్న ఒక జంట ఒకరినొకరు చూడకుండ ఉండటం ఎంత కష్టం. అందుకే వారి ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ చక్కటి ప్లాన్ చేసారని, అంతా కలిసి ఏకాంతంగా గడపడానికి, మీడియా హడావుడి నుండి తప్పించుకోవడానికి విదేశాలకు జంప్ అయ్యారని ప్రచారం జరుగుతోంది.
సమంత, నాగ చైతన్య విరహవేదన, వారు పడుతున్న బాధ చూస్తూ ఉండలేక వారి స్నేహితులైన రవితేజ, రానా, రకుల్, రెజీనా, ప్రీతిరెడ్డి, నీరజ కోన తదితరులు విదేశీ టూర్ ప్లాన్ చేసారు. అంతా కలిసి బెల్జియం వెళ్లారు. అక్కడ జరుగుతున్న మ్యూజిక్ ఫెస్టివల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడైతే ఇక్కడిలాగా మీడియా గొడవ ఉండదు, ప్రైవసీ కూడా ఎక్కువగా ఉంటుంది, కావాల్సినంత ఏకాంతంగా గడపొచ్చు.
వీరి బెల్జియం టూర్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. ఇందులో అంతా కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి కానీ... సమంత, నాగ చైతన్య పక్క పక్కన ఉన్న ఫోటోలు మాత్రం లేవు. అలాంటి ఫోటోలు ఉంటే మళ్లీ తమపై లేని పోని వార్తలు ప్రచారంలోకి వస్తాయనే ఉద్దేశ్యంతో ఫోటోల వరకు మాత్రం... కాస్త దూరంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

సమంత, నాగ అండ్ ఫ్రెండ్స్
సమంత, నాగ్ తమ స్నేహితులు రవితేజ, రానా, రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రీతిరెడ్డి, నీరజ కోనలతో కలిసి బెల్జియం పర్యటనో...
ఫోటో సౌజన్యం: ట్విట్టర్

సమంత
తన స్నేహితురాలు, ప్రముఖ డిజైనర్ ప్రీతిరెడ్డితో కలిసి సమంత..
ఫోటో సౌజన్యం: ట్విట్టర్

చైతూ..
సమంత పక్కన కాకుండా రానా వెనక నిల్చొన్న నాగ చైతన్య...
ఫోటో సౌజన్యం: ట్విట్టర్

నీరజ కోన, సమంత
తన బెస్ట్ ఫ్రెండ్, తన పర్శనల్ స్టైలిస్ట్ నీరజ కోనతో కలిసి సమంత.
ఫోటో సౌజన్యం: ట్విట్టర్

రానా, రకుల్, ప్రీతిరెడ్డి
బెల్జియం పర్యటనలో రానా, రకుల్, ప్రీతి రెడ్డి తదితరులు...
ఫోటో సౌజన్యం: ట్విట్టర్

సమంత అండ్ ఫ్రెండ్స్
సమంత, రెజీనా, రకుల్, నీరజ కోన కలిసి బెల్జియం పర్యటనలో....
ఫోటో సౌజన్యం: ట్విట్టర్

ఎజాయ్మెంట్
బెల్జియంలో వీరంతా ఎంతలా ఎంజాయ్ చేసారో ఈ ఫోటో చూసి అర్థం చేసుకోవచ్చు.
ఫోటో సౌజన్యం: ట్విట్టర్

సమంత కేక
బెల్జియంలో ఓ పర్యాటక ప్రదేశంలో సమంత.. లుక్ అదిరింది కదూ...
ఫోటో సౌజన్యం: ట్విట్టర్