For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంట్రెస్టింగ్: నాగ చైతన్య, సమంత చెప్పిన ప్రేమ విషయాలు!

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: అక్కినేని యంగ్ స్టార్ నాగ చైతన్య త్వరలో హీరోయిన్ సమంతను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా ఇద్దరూ గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపించారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఇంట్లో వాళ్లని ఒప్పించిన తర్వాతగానీ... విషయం మీడియా వరకు రాలేదు. అది కూడా సమంత ఓ ఇంటర్వ్యూలో అనుకోకుండా నోరు జారడంతో విషయం అందరికీ తెలిసి పోయింది.

  తర్వాత నుండి ... చైతు, సమంత కాస్త ఫ్రీ అయ్యారనే చెప్పాలి. అంతకు ముందు వరకు ఎవరికీ తెలియకుండా చాటు మాటు వ్యవహారాలు నడిపించడం మానేసి కొన్ని రోజులుగా ఓపెన్ గానే కలిసి తిరగడం, డేట్ కు వెళ్లడం లాంటివి చేస్తున్నారు.

  తాజాగా పలు ఇంటర్వ్యూల్లో ఇంటర్వ్యూలో నాగ చైతన్య, సమంత తన ప్రేమ వ్యవహారానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పడంతో పాటు, పెళ్లి గురించి కాస్త క్లారిటీ ఇచ్చారు.

  సమంతతో ప్రేమ ఎలా మొదలైంది

  సమంతతో ప్రేమ ఎలా మొదలైంది

  ‘ఏమాయ చేసావే' సినిమా చేస్తున్పటి నుంచే సమంతతో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తమకు తెలియకుండానే ‘బెస్ట్ ఫ్రెండ్స్'గా మారిపోయామని, ఆ స్నేహమే ఒకరిపై ఒకరికి మరింత ఇష్టాన్ని పెంచింది. తమది ఏ ఒక్కరోజులోనో పుట్టిన ప్రేమ కాదని చైతూ చెప్పుకొచ్చారు.

  సమంత తప్ప వేరే అమ్మాయి గుర్తు రాలేదు

  సమంత తప్ప వేరే అమ్మాయి గుర్తు రాలేదు

  మేము ఇంతకాలం స్నేహం చేసామా? ప్రేమలో ఉన్నామా? అంటే చెప్పడం కష్టమే. మేము ఎప్పుడూ ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదు. 30 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, అప్పుడు సమంత తప్ప మరే అమ్మాయని ఊహిచుకోలేకపోయాను అని చైతు తెలిపారు.

  నేనే ముందు సమంతను అడిగా

  నేనే ముందు సమంతను అడిగా

  ఇంతకాలం మా మధ్య స్నేహం ఉంది. సమంత అంటే ఇష్టం. ఆమెతో అన్ని విషయాలు పంచుకునే చనువు ఉంది. పెళ్లి ఆలోచన వచ్చింది ఈ ఏడాదే. నాకు సమంత అంటే ఇష్టం. నేరుగా వెళ్లి ఆమెను ఎన్ని రోజులు బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటాం. పెళ్లి చేసుకుందాం. నాకు నువ్వు కరెక్ట్ అనిపిస్తోంది... అని సమంతకు చెప్పినట్లు చైతు వెల్లడించారు.

  సమంత వద్దని ఉంటే

  సమంత వద్దని ఉంటే

  తాను పెళ్లి ప్రపోజల్ తీసుకెళ్లే వరకు సమంత ఎలాంటి రిప్లై ఇస్తుందనేది ఊహించలేదు. ఒక వేళ పెళ్లి వద్దనుకుంటే మాత్రం ఇక్కడితో ఆపేద్దామని సమంతతో చెప్పాను. నేను అడిగిన వెంటనే సమంత తన ఇష్టాన్ని చేసిందని, ఆ క్షణమే తాము పెళ్లితో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నామని నాగ చైతన్య తెలిపారు.

  ఇంట్లో వాళ్లకి ముందే తెలుసు

  ఇంట్లో వాళ్లకి ముందే తెలుసు

  నేను, సమంత ప్రేమలో ఉన్న విషయం కుటుంబ సభ్యులందరికీ ముందే తెలుసు. వారు తమకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు, ప్రైవసీ ఇచ్చారు అని నాగ చైతన్య తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

  అలా ఉండటం నచ్చదు

  అలా ఉండటం నచ్చదు

  మేము ఇద్దరం ఉన్నది సినిమా రంగంలో. వృత్తిపరంగా ఆర్భాటాలు తప్పవు. కానీ వ్యక్తిగతంగా నాకుగానీ, సమంతకు గానీ ఆర్భాటంగా జీవించడం నచ్చదు. సింపుల్ గా ఉండటానికే ఇద్దరం ఇష్టపడతాం అని నాగ చైతన్య తెలిపారు.

  పెళ్లి గురించి...

  పెళ్లి గురించి...

  వచ్చే ఏడాది బంధు మిత్రుల సమక్షంలో మా వివాహం జరుగుతుంది. అయితే ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. డేట్ ఫిక్స్ అయిన తర్వాత నేనే స్వయంగా ప్రకటిస్తాను అని నాగ చైతన్య తెలిపారు.

  సమంత మాట్లాడుతూ...

  సమంత మాట్లాడుతూ...

  మొదట్లో తాము స్నేహితుల్లా ఉండేవారమని, తర్వాత ఒకరిపై ఒకరి ఇష్టం ప్రేమగా మారిందని సమంత చెప్పుకొచ్చారు. అయితే స్నేహం, ప్రేమగా మారిన సందర్భం ఏదైనా ఉందా? అనే ప్రశ్నకు సమంత సరైన సమాధానం చెప్పలేక పోయింది.

  క్లూ ఇచ్చినా ఎవరూ గమనించలేదు

  క్లూ ఇచ్చినా ఎవరూ గమనించలేదు

  తమ ప్రేమకు సంబంధించి మొదటి నుండి పలు ఇంటర్వ్యూల్లో క్లూలు ఇస్తూనే వస్తున్నాను. కానీ ఎవరూ వాటిని గమనించలేక పోయారు అని సమంత తెలిపారు. ఏమాయ చేసావే సినిమా తర్వాతే తమ మధ్య ప్రేమ మొదలైందన్నారు.

  ఫస్ట్ లవ్

  ఫస్ట్ లవ్

  మీతో కలిసి యాక్ట్ చేసిన హీరోల గురించి చెప్పాలని మీడియా వారు అడిగినపుడు నాగ చైతన్య గురించి చెప్పేటప్పుడు ‘ఫస్ట్ లవ్' అనే పదాన్ని వాడేదాన్ని, కానీ ఎవరూ ఆ విషయం గమనించలేదు అని సమంత తెలిపారు.

  ఇద్దరం కలిసి ఉండలేక పోతే

  ఇద్దరం కలిసి ఉండలేక పోతే

  నా జీవితంలో నాగ చైతన్య చాలా ముఖ్యమైన వ్యక్తి. ఇండస్ట్రీలో నా మొదటి స్నేహితుడు. ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్. ఇండస్ట్రీలో ఒకటిగా ఎదిగాం. మేమిద్దరం కలిసి ఉండలేక పోతే ఎవరితోనూ కలిసి ఉండలేమనిపించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని సమంత తెలిపారు.

  English summary
  Check out Naga Chaitanya, Samantha interviwe about their love and marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X