For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చై సామ్ ల పెళ్లి వీడియో: ఎంత ఉద్వేగంగా మాట్లాడిందో చూడండీ

    |

    పెళ్లి ఇలా అయిందో లేదో.. వెంటనే సినిమా ప్రమోషన్‌లో దర్శనమిచ్చిన సమంత, పెళ్లి ఎంత ముఖ్యమో, తనకు సినిమా కూడా అంతే ముఖ్యం అన్నట్లుగా తెలిపారు. పెళ్లి తర్వాత లక్కీగా విడుదలైన 'రాజు గారి గది 2' చిత్రం అంతే లక్కీగా విజయం సాధించడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని తెలిపిన ఆమె, ఈ చిత్రంలో చేసిన పాత్రని ప్రతి నటి చేయాలని కోరుకుంటుందని తెలిపారు.

     మంచి పాత్రలు

    మంచి పాత్రలు

    ఈ మధ్య హీరోయిన్‌లకి కూడా మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. హీరోయిన్‌లని నమ్మి దర్శకులు, రచయితలు మంచి పాత్రలు రాస్తున్నారు. మున్ముందు ఇంకా మంచి పాత్రలు రాయాలని కోరుకుంటున్నానని తనకొచ్చిన అమృత పాత్ర చాలా మంచి పాత్ర అని తెలిపారు సమంత.

    నేనే చేయాలని మాత్రం కోరుకోను

    నేనే చేయాలని మాత్రం కోరుకోను

    అన్ని పాత్రలు నేనే చేయాలని మాత్రం కోరుకోను. నేను చూసే సినిమాలో ఏ పాత్ర నచ్చినా వెంటనే కాల్ చేసి ఆ పాత్ర చేసిన వారిని అభినందిస్తానంటున్నారు. సెలబ్రిటీ అనే కాదు 'సుచీ లీక్స్' వంటి విషయాలు బయటికి వస్తే ఎవరి జీవితమైనా రోడ్డునే పడుతుంది.

     సామాన్య విషయమే

    సామాన్య విషయమే

    ఇది కొంత మందికి సామాన్య విషయమే అనిపించినా, దీని వెనుక కొన్ని జీవితాలు ఉన్నాయనేది మరిచిపోయి, స్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఈ కథ విన్నప్పుడు కూడా నాకు అదే అనిపించింది. ఇలాంటి కథను నా దగ్గరకు తీసుకువచ్చి, నేను కూడా ఆత్మగా చేయగలననే నమ్మకాన్ని కలిగించారు ఓంకార్ గారు అంటూ ఆమె ఈ సినిమా స్టోరీ ఓకే చేయడం వెనుక ఉన్న ఉద్ధేశ్యాన్ని తెలిపారు.

    హనీమూన్ ఎప్పుడు

    హనీమూన్ ఎప్పుడు

    ఇక పెళ్లి అయింది కదా హనీమూన్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అంటే.. ఇంకా దాని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు నా టార్గెట్ అంతా సావిత్రి సినిమానే. ఆ సినిమాలో నా పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుంది అన్నారు. హనీమూన్‌ని 'ఏ మాయ చేసావె' చిత్ర షూటింగ్ జరిగిన చోట ప్లాన్ చేస్తున్నారంటగా అంటే 'నవ్వుతూ..అవునా చాలా మంచి ఆలోచన' అంటూ దీనిపై తనకేం తెలియదన్నట్లుగా స్పందించారు సమంత.

     నాగచైతన్య గురించి

    నాగచైతన్య గురించి

    హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం నాగచైతన్య-సమంత వివాహం గోవాలో ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహ వేడుకలు మొదలైనప్పటి నుంచి ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరడం విదితమే. తాజాగా, క్రైస్తవ పద్ధతిలో వీరి వివాహం జరిగిన సందర్భంలో నాగచైతన్య గురించి సమంత చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

    నా జీవితానికి పరిపూర్ణత లభించింది

    ఈ వీడియోలో సమంత మాట్లాడుతూ, ‘నీ రాకతోనే నా జీవితానికి పరిపూర్ణత లభించింది. నా జీవితంలో నేను చూసిన అద్భుతమైన చిరునవ్వు నీదే. నాకు మరో వంద అవకాశాలు వచ్చినా, మరో వంద జన్మలెత్తినా నా భర్తగా నిన్నే కోరుకుంటా. మన పిల్లలకు మంచి తండ్రివి అవుతావు' అని ఆ రోజున సమంత భావోద్వేగంతో మాట్లాడింది.

    English summary
    Samantha Ruth Prabhu, Naga Chaitanya’s wedding is all about happy moments
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X