చైతు, సమంత కొత్త చిత్రం లాంచ్.. వివాహం అనంతరం తొలిసారి జంటగా!
రియల్ లైఫ్ కపుల్ చైతు, సమంత రీల్ లైఫ్ లో నటించే సినిమా ప్రారంభమైంది. వివాహానికి ముందు చైతు, సమంత పలు చిత్రాల్లో జంటగా నటించారు. భార్యాభర్తలయ్యాక హీరో, హీరోయిన్లుగా నటించబోతున్న తొలి చిత్రం ఇది. శివ నిర్వాణ దర్శకత్వం వహించే ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
శివ నిర్వాణ నిన్ను కోరి చిత్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్ను కోరి చిత్రం రొమాంటిక్ హిట్ గా నిలిచింది. మూవీ లాంచ్ ఈవెంట్ కు కింగ్ నాగార్జున అతిధి గా హాజరయ్యారు. షైన్ స్క్రీన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో నాగ చైతన్య క్రికెటర్ పాత్రలో నటిస్తారని సమాచారం. నాగ చైతన్య, సమంత భార్య భర్తలుగానే కనిపిస్తారట. ప్రముఖ రచయిత కోనవెంకట్ కూడా ఈ వేడుకకు హాజరయ్యాడు. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











