»   »  మా పెళ్లికి రారండోయ్..... హీరో అక్కినేని నాగ చైతన్య పిలుపు!

మా పెళ్లికి రారండోయ్..... హీరో అక్కినేని నాగ చైతన్య పిలుపు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పటి వరకు తన సినిమా కోసం కోసం రారండోయ్ అని పిలిచానని.... ఇకపై తన పెళ్లి గురించి రారండోయ్ అని పిలుస్తానని నాగ చైతన్య అన్నారు. తన తాజా సినిమా 'రారండయ్ వేడుక చూద్దాం' బాక్సాఫీసు వద్ద మంచి విజయం సొంతం చేసుకోవడంపై చైతన్య హ్యాపీగా ఉన్నారు.

త్వరలో తన ప్రేయసి సమంతను పెళ్లాడబోతున్న నేపథ్యంలో.... ఇందుకు సంబంధించిన విషయాలనుకూడా చైతన్య పంచుకున్నారు. అక్టోబర్ మాసంలో తమ వివాహం ఉంటుందని, అపుడు అందరినీ రారండోయ్ అని పిలుస్తానని తెలిపారు.

ఇండియాలోనే వివాహం

ఇండియాలోనే వివాహం

తన వివాహం విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరుగుతుందనే వార్తల్లో నిజం లేదని, ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలని తాను, సమంత నిర్ణయించుకున్నామని నాగ చైతన్య తెలిపారు.

రెండు సాంప్రదాయాల ప్రకారం...

రెండు సాంప్రదాయాల ప్రకారం...

ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో.... రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం జరుగుతుందని, హిందూ, క్రైస్త‌వ‌ సంప్రదాయాల ప్రకారం స‌మంత‌తో త‌న పెళ్లి మ‌న‌ దేశంలోనే జరుగుతుందని నాగ చైతన్య స్పష్టం చేసాడు.

సమంత గురించి

సమంత గురించి

స‌మంత త‌న‌ అభిరుచుల్ని గమనించి తనను ప్రోత్సహిస్తుందని, అదే సమయంలో తాను కూడా స‌మంత‌ అభిరుచుల విషయంలో అలాగే ఉంటాన‌ని చెప్పాడు. అన్ని విషయాల్లో ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉంది కాబట్టే తమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చిందన్నారు.

అల్లరి పిల్లే, కానీ మంచి అమ్మాయి

అల్లరి పిల్లే, కానీ మంచి అమ్మాయి

సమంతతో తన‌కు ఏడేళ్లుగా స్నేహం ఉంది. ఈ క్రమంలో ఇద్దరం ఒకరిగురించి ఒకరం బాగా అర్థం చేసుకున్నామని తెలిపారు. స‌మంత ఓ మంచి అమ్మాయని అన్నాడు. అలాగే అల్లరి అమ్మాయి అని కూడా నాగ చైతన్య అన్నారు.

తీపి గుర్తులు

తీపి గుర్తులు

త‌మ తొలి పరిచయం నుండి.... తమ మధ్య కొనసాగిన స్నేహం, ప్రేమ ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని తీపిగుర్తులుగా త‌న మ‌దిలో ఉండిపోతాయని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.

English summary
Tollywood stars Naga Chaitanya and Samantha Prabhu to get married in October 2017. Naga Chaitanya confirms this news.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu