సీక్రెట్‌గా చైతూ, సమంత రిసెప్షన్.. చైతూ తల్లి ఇచ్చిన పార్టీకి ఆయన సహకారం.
టాలీవుడ్ సినీ పరిశ్రమకు దూరంగా నాగచైతన్య, సమంత వివాహం గోవాలో అక్టోబర్ 6న బ్రహ్మండంగా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ వివాహ పద్దతుల్లో జరిగిన ఈ వేడుకకు అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులతోపా
టాలీవుడ్ సినీ పరిశ్రమకు దూరంగా నాగచైతన్య, సమంత వివాహం గోవాలో అక్టోబర్ 6న బ్రహ్మండంగా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ వివాహ పద్దతుల్లో జరిగిన ఈ వేడుకకు అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులతోపాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

రిసెప్షన్‌కు ఏర్పాట్లు
గోవాలో పెళ్లి తంతు ముగిసింది. ఇక నాగ చైతన్య, సమంత పెళ్లి రిసెప్షన్ ఎప్పుడెప్పుడా అని సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. పెళ్లి తర్వాత సినీ ప్రముఖులకు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా విందు ఏర్పాటు చేస్తామని నాగార్జున వివరించారు కూడా.

నాగచైతన్య తల్లి లక్ష్మీ స్వయంగా
ఇదిలా ఉండగా, చైతూ, సమంతల వివాహ రిసెప్షన్ ప్రైవేట్‌గా నిర్వహించినట్టు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ వేడుకను నాగచైతన్య తల్లి లక్ష్మీ స్వయంగా నిర్వహించిందట. లక్ష్మీ కోరిక మేరకు చైతూ మేనమామ సురేశ్ బాబు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకొన్నట్టు సమాచారం.

కొద్దిమందికే ఆహ్వనం
కొద్దిమందికే ఆహ్వనం అందిన ఈ వేడుకను హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జరిపినట్టు సమాచారం. ఈ విందులో నెల్లూరు, కారంచేడు, గుంటూరు, రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి దగ్గుబాటి కుటుంబానికి చెందిన సమీప బంధువులు హాజరైనట్టు సమాచారం.

త్వరలోనే నాగ్ రిసెప్షన్
చైతూ, సమంత పెళ్లి జరిగి పదిరోజులకు పైగా కావొస్తున్న నేపథ్యంలో పెళ్లి రిసెప్షన్‌కు నాగార్జున ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. పెళ్లి తర్వాత రాజు గారి గది2 చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సమంత, నాగ్.. ఇప్పుడిప్పుడే ఫ్రీ అయినట్టు సమాచారం. త్వరలోనే రిసెప్షన్ డేట్ అనౌన్స్ చేస్తారనేది ఫిలింనగర్ సమాచారం.


Click it and Unblock the Notifications











