నేను నిన్ను నమ్మను సమంత.. నువ్వు అందంగా లేవు.. వైరల్ అవుతున్న వీడియో!
వివాహం తర్వాత తొలిసారి సమంత, నాగ చైతన్య జంటగా నటించిన చిత్రం మజిలీ. దీనితో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో చైతు, సమంత భార్య భర్తలుగానే నటిస్తున్నారు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏప్రిల్ 5న మజిలీ ప్రేక్షకుల ముందుకు రానుండడంతో సమంత, నాగ చైతన్య ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

మజిలీ ప్రమోషన్స్
నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శత్వంలో మజిలీ చిత్రం తెరకెక్కింది. నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. చైతు, సమంత జంటగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మజిలీ ప్రమోషన్ లో భాగంగా సమంత, నాగ చైతన్య ఆడిన సరదా ఆట వీడియోని చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో నెటిజన్లని బాగా ఆకట్టుకుంటోంది.

నేను నిన్ను నమ్మను
సమంత హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే.. నాగ చైతన్య ఓ పదం చెబుతాడు. అదేంటో సమంత కనిపెట్టాలి. అలాగే సమంత చెప్పిన పదాన్ని కూడా చైతు హెడ్ ఫోన్స్ పెట్టుకుని కనిపెట్టాలి. ఈ ఆట వీరి మధ్య చాలా సరదాగా సాగింది. సమంత, చైతు మధ్య సంభాషణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సమంత హెడ్ ఫోన్స్ తలపై నుంచి కాకుండా మెడ కింది నుంచి పెట్టుకుంది. ఎందుకు ఆలా పెట్టుకున్నావు అని చైతు అడిగితే.. హెయిర్ పాడవుతుంది అని సమాధానం ఇస్తుంది. నేను నిన్ను నమ్మను సమంత. హెడ్ ఫోన్స్ సరిగ్గా పెట్టుకో అని చెబుతాడు.
అందంగా లేవు
నువ్వు అందగాలేవు అని చైతు సరదాగా అంటాడు. ఆ పదం సమంతకు అర్థం కాక తికమకపడుతుంది. ఆ తర్వాత మజిలీ చిత్రానికి సంబందించిన కొన్ని పడాలని చైతు వినిపిస్తాడు. వరుసగా అన్ని పదాలని సమంత కనిపెట్టేస్తుంది. నాకు మంచు ప్రదేశాలంటే చాలా ఇష్టం అనే డైలాగ్ చెబుతాడు. దానిని కూడా సమంత కనిపెట్టేస్తుంది. సమంత అన్నింటికీ సమాధానం చెబుతోంది.. ఇక్కడేదో చీటింగ్ జరుగుతోంది అని నాగ చైతన్య అంటాడు. అది నా డైలాగ్ ఆ మాత్రం గుర్తుపట్టలేనా అని సమంత అంటుంది.

కీలక పాత్రల్లో
ఇక మజిలీ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్ గా నటించింది. రావు రమేష్, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రల్లో నటించారు. గోపి సుందర్, తమన్ ఈ చిత్రాన్ని సంగీతం అందించారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ లో నిర్మించారు. సమంత, నాగ చైతన్య ఎమోషనల్ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుందని ఇటీవల దర్శకుడు శివ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తెలిపిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











