సెన్సార్ పూర్తి చేసుకున్న మజిలీ!
వివాహం తర్వాత తొలిసారి సమంత, నాగ చైతన్య జంటగా నటించిన చిత్రం మజిలీ. దీనితో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో చైతు, సమంత భార్య భర్తలుగానే నటిస్తున్నారు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మజిలీ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది.
సమంత, చైతు నటిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా మజిలీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనితో మజిలీ చిత్రం విడుదలకు అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 5న మజిలీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సార్ సభ్యులు మజిలీ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు.

దివ్యాంశ కౌషిక్ ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తోంది. మజిలీ చిత్రంలో నాగ చైతన్య యువకుడిగా, పెళ్ళైన వ్యక్తిగా రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడు. సమంత, చైతు మధ్య ఎమోషనల్ సీన్స్ హృదయాన్ని హత్తుకునేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కింది. గోపి సుందర్, తమన్ మజిలీ చిత్రానికి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











