'మజిలీ' టీజర్: వెధవలకెప్పుడూ మంచి పెళ్ళాలు దొరుకుతారు.. చైతు, సమంత కేక పెట్టించారుగా!

Recommended Video

MAJILI Movie Teaser - Naga Chaitanya - Samantha - Divyansha Kaushik

రియల్ లైఫ్ కపుల్స్ అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం తర్వాత జంటగా నటిస్తున్న తొలి చిత్రం మజిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమ, కుటుంబ బంధాలు ప్రధానంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందిస్తున్నారు. మజిలీలో సమంత, చైతు భార్య భర్తలుగా నటిస్తున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మజిలీ టీజర్ విడుదల చేశారు.

యువ క్రికెటర్

యువ క్రికెటర్

మజిలీ టీజర్ ని దర్శకుడు శివ నిర్వాణ ఆసక్తికర అంశాలతో రూపొందించారు. నీకొక సంవత్సరం టైం ఇస్తున్నాను. ఈ లోగా నువ్వు సచినే అవుతావో లేక సోంబేరి అవుతావో నీ ఇష్టం అంటూ రావు రమేష్ వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. యువ క్రికెటర్ గా నాగ చైతన్య కనిపిస్తున్నాడు. క్రికెటర్ గా ఉన్నత స్థాయికి ఎదగాలనేది అతడి కల. అదే సమయంలో చైతు, దివ్యాన్ష కౌశిక్ మధ్య రొమాంటిక్ లవ్ ట్రాక్ నడుస్తుంది.

నా ఫ్యామిలీ జోలికి రావద్దు

నా ఫ్యామిలీ జోలికి రావద్దు

పెద్ద క్రికెటర్ కావాలన్న చైతు కల చెదురుతుంది. అనుకోని పరిస్థితుల్లో చైతు, సమంత వివాహం జరుగుతుంది. సమంత భర్తని ఘాడంగా ప్రేమించే మహిళగా ఈ అద్భుత నటనని కనబరిచింది. నా ఫ్యామిలీ జోలికి రావద్దు, మా ఆయనకు మంచు ప్రదేశాలంటే చాలా ఇష్టం అంటూ తనదైన శైలిలో డైలాగులతో ఆకట్టుకుంది. చైతు గడ్డం లుక్ లో కనిపిస్తూ ఎమోషనల్ సీన్స్ లో అదరగొడుతున్నాడు.

నా మనసులోకి రాలేవు

నువ్వు నా గదిలోపలకి రాగలవేమో కానీ నా మనసులోకి రాలేవు అని చైతు చెప్పే డైలాగ్ ఎమోషనల్ గా ఉంది. గోపిసుందర్ అందించిన బ్యాగ్రౌండ్ సంగీతం కూడా బావుంది. టీజర్ చివర్లో వెధవలు ఎప్పుడూ మంచి పెళ్ళాలు దొరుకుతారని నువ్వే ప్రూవ్ చేశావు అని పోసాని చెప్పే డైలాగ్ చాలా బావుంది. చైతు వర్షంలో నిలబడి సిగరెట్ కాల్చుతుండగా సమంత వచ్చి గొడుగు పట్టే సీన్ టీజర్ కే హైలైట్.

విడుదల ఎప్పుడంటే

విడుదల ఎప్పుడంటే

మజిలీ టీజర్ చిత్రంపై అంచనాలు పెంచేలా ఉంది. సమంత, చైతు జంటగా నటిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మజిలీ చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నిన్నుకోరి లాంటి రొమాంటిక్ హిట్ తో సత్తా చాటిన శివ నిర్వాణ మజిలీతో మరో హిట్ పై కన్నేశాడు. ఈ చిత్ర విజయం నాగ చైతన్యకు చాలా కీలకం. చైతు గత చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X