Don't Miss!
- News ఏపీలో కూటమి కోసం ప్రధాని మోదీ కీలక నిర్ణయం..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సమంత నాగ చైతన్య మధ్య ఎంత తేడా?.. ఆ విషయంలో అస్సలు పోలికే లేదు!
సమంత నాగ చైతన్యలు కొన్ని విషయాల్లో ఒకేలా ఉంటే.. ఇంకొన్ని విషయాల్లో మాత్రం పూర్తి విరుద్దంగా ఉంటారు. అలా తాజాగా ఈ ఇద్దరి మధ్య ఉన్న పోలికలు, బేదాలు అన్నీ కూడా బయటపడ్డాయి. సమంత సామ్ జామ్ షోలో నాగ చైతన్య గెస్ట్‌గా వచ్చాడు. ఈ మేరకు ఆ మధ్య వచ్చిన ప్రోమోలు ఓ రేంజ్లోక్లిక్ అయ్యాయి. అయితే తాజాగా ఎపిసోడ్ ఆహాలో అందుబాటులోకి వచ్చింది. అందులో సామ్, చైల ముచ్చట్లు బాగానే వైరల్ అవుతున్నాయి.
చివరగా అలా..
సమంత ఆహా యాప్ కోసం సామ్ జామ్ షో చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో మొదటి సీజన్ పూర్తయింది. అది కూడా చివరగా నాగ చైతన్యను గెస్ట్‌గా తీసుకొచ్చి అందమైన వీడ్కోలును పలికారు. మరో సీజన్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ చివరి ఎపిసోడ్లో భార్యభర్తల ముచ్చట్లు మాత్రం బాగానే వైరల్ అయ్యాయి.
ఆ విషయంలో తేడా..
సమంత నాగ చైతన్యలు ఓ విషయంలో భిన్న దృవాల మాదిరి ఉంటారు. అదే సోషల్ మీడియా. అందులో సమంత ఈత కొడుతూ ఉంటే.. నాగ చైతన్య మాత్రం ఒడ్డున నిలబడి అలా చూస్తున్నట్టు ఉంటాడు. సమంత ఒక రోజులో చేసే పోస్ట్‌లు నాగ చైతన్య ఏడాది మొత్తం చేస్తాడట.
ఏడాదిలో అలా..
సోషల్ మీడియాలో ఎవరు ఎలా ఉంటారని చెబుతూ.. తాను ఏడాదికి 1040 పోస్ట్‌లు చేస్తే.. చైతన్య 40 పోస్ట్‌లు చేశాడంటూ సమంత చెప్పుకొచ్చింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య అంత దూరం ఉందని చెబుతూ..అసలు సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటావనేది నీ ఫ్యాన్స్‌కు చెప్పు అంటూ నాగ చైతన్యను సమంత అడిగింది.
ప్రైవేట్ లైఫ్..
రిజర్వ్డ్గా ఉండటమే నాకు ఇష్టం.. సినిమాలో కనిపిస్తాం.. అది చాలు.. ఆ తరువాత నాది పర్సనల్ లైఫ్.. నా పర్సనల్ లైఫ్‌ను పబ్లిక్ చేయడం నాకు ఇష్టం ఉండదు.. అది నా స్పేస్.. అలా ఉండటమే నాకు ఇష్టమంటూ నాగ చైతన్య స్పందించాడు. మరి నువ్ ఎందుకు ప్రతీ ఫోటోను షేర్ చేస్తావ్ అని సమంతను చైతన్య అడిగాడు.
అదే సమంత..
సినిమాల్లో కనిపించేది తాను కాదని.. అవి పాత్రలని.. అయితే నిజమైన సమంత ఏంటో తెలియాలని అలా చేస్తున్నాను అని సమంత చెప్పుకొచ్చింది. అందుకే అలా చేస్తుంటాను.. అదే నిజమైన సమంత అంటూ నాగ చైతన్యకు రిప్లై ఇచ్చింది.