నాగచైతన్య - సమంతలతో ‘మనం’ షురూ!

By Bojja Kumar

హైదరాబాద్ : అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్ 'మనం' చిత్రం ఇటీవల లాంచనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నాగ చైతన్య-సమంతలపై సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఇది వరకు 'ఇష్క్' లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన శ్రీయ, నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్లుగా చేస్తున్నారు.

అక్కినేని నాగేశ్వరరావుకు జోడీగా బాలీవుడ్ నిన్నతరం నటి రేఖ ఎంపికయింది. ఈచిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. పిఎస్ వినోద్ కెమెరామెన్. ఈ సినిమాలో వీరు ముగ్గురూ నిజ జీవితంలో మాదిరి అక్కినేని, నాగ్, చైతు ఈ చిత్రంలో తాత, తండ్రి, కొడుకు పాత్రలు పోషిస్తారు.

గతంలో నాగేశ్వరావు, నాగార్జున కలిసి కలెక్టర్ గారి అబ్బాయి చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఈ సినిమాలో మూడు తరాల నటులు కలిసి నిజజీవిత పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణా స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X