»   » నాగ చైతన్య, సమంత... రిసెప్షన్ డేట్ ఫిక్స్!

నాగ చైతన్య, సమంత... రిసెప్షన్ డేట్ ఫిక్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగ చైతన్య, సమంత మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 6వ తేదీన గోవాలో వీరి వివాహం జరుగబోతోంది. పెళ్లి వేడుక హిందూ, క్రిస్టిన్ సాంప్రదాయాల్లో రెండు సార్లు జరుగబోతోంది. తొలుత హిందూ సాంప్రదాయంలో వివాహ వేడుక జరిగిన తర్వాత, మర్నాడు క్రిస్టియన్ స్టైల్ లో పెళ్లి జరుగనుంది.

గోవాలో జరిగే పెళ్లి వేడుకకు ఫ్యామిలీ మెంబర్స్, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు. సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు, ఇతర ముఖ్యమైన వ్యక్తుల కోసం హైదరాబాద్ లో గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు.

రిసెప్షన్ డేట్ ఫిక్స్

రిసెప్షన్ డేట్ ఫిక్స్

హైదరాబాద్‌లో అక్టోబర్ 10వ తేదీన రిసెప్షన్ పార్టీ గ్రాండ్‌గా జరుగబోతోంది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఇతర సినీ పరిశ్రమల నుండి సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు.

నాగార్జున పర్సనల్‌గా..

నాగార్జున పర్సనల్‌గా..

తన కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్ నేపథ్యంలో కొందరు వీఐపీలకు నాగార్జున పర్సనల్‌గా వెళ్లి ఇన్వైట్ చేసినట్లు సమాచారం.

గ్రాండ్‍‌గా బ్యాచిలర్ పార్టీ

గ్రాండ్‍‌గా బ్యాచిలర్ పార్టీ

కాగా.... నాగ చైతన్య తన స్నేహితులకు, సన్నిహితులకు పెళ్లికి ముందు గ్రాండ్‌గా బ్యాచిలర్ పార్టీ ఇవ్వబోతున్నాడు. ఈ వేడుకకు ఇండస్ట్రీలోని కొందరు యంగ్ హీరోలు హాజరవుతారని తెలుస్తోంది. దీని తర్వాత సంగీత్, మెహందీ ఫంక్షన్లు జరుగనున్నాయి.

పెళ్లి తర్వాత కూడా

పెళ్లి తర్వాత కూడా

పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో కొనసాగనుంది. ఈ విషయంలో నాగ చైతన్యకు గానీ, నాగార్జున ఫ్యామిలీకి గానీ ఎలాంటి అభ్యంతరాలు లేవు.

English summary
Akkineni Naga Chaitanya and gorgeous Samantha are getting married on October 6th in Goa. Since the marriage will be a simple affair, Nagarjuna is planning to throw a grand wedding reception on October 10th in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu