ఈసారి 'పక్కా' అంటున్న చైతూ: రేపే సవ్యసాచి 'ఫస్ట్ పంచ్'..
మాస్ హీరోగా నిలదొక్కుకోవాలని ఆరాటపడుతున్న హీరో నాగచైతన్య.. ఆ ప్రయత్నంలో భాగంగా 'సవ్యసాచి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నిజానికి చైతూకి తొలి నుంచి మాస్ సినిమాల కంటే ప్రేమకథలే హిట్స్ తెచ్చిపెట్టాయి. ఏం మాయ చేశావే, 100శాతం లవ్ వంటి సినిమాలు చైతూకి మంచి పేరు తెచ్చాయి.
ఇక మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ చేసిన దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, యుద్దం శరణం.. ఇవన్నీ ఫ్లాపులుగానే మిగిలిపోయాయి. అయినా సరే చైతూ మాత్రం మాస్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతూనే ఉన్నాడు. అయితే తనకు ప్రేమమ్ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటి 'సవ్యసాచి'ని తెరకెక్కిస్తుండటంతో.. ఈ సినిమాతో మాస్ ఇమేజ్ పక్కా అని నమ్ముతున్నాడు చైతూ.

ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాకు సంబంధించి తొలి పోస్టర్‌ను మార్చి 16న విడుదల చేయనున్నారు. ఫస్ట్ పంచ్ పేరుతో ఈ పోస్టర్ రేపు (శుక్రవారం) ఉదయం 10:30 లకు విడుదల కానుంది. 'సవ్యసాచి'లో మాధవన్ విలన్ గా నటిస్తుండటం కూడా కలిసొచ్చే అంశమని చెప్పాలి.
చైతూ-మాధవన్ మధ్య వచ్చే సీన్లు, ఫైటింగ్స్ సినిమాకి హైలెట్ అవుతాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











