బాంబులా పేలిన నాగచైతన్య 'సవ్యసాచి', ప్రీ రిలీజ్ బిజినెస్.. భూమిక, మాధవన్ ఇద్దరూ, అసలు కారణం!
Recommended Video

అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం సవ్యసాచి. కథా బలంతో, థ్రిల్లర్ అంశాలతో చిత్రాన్ని నడిపించగల దర్శకుడు చందు ముండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సవ్యసాచి అనే టైటిల్ తోనే ఈ చిత్రం అందరిలో ఆసక్తి పెంచింది. నాగ చైతన్య సరసన ఈ చిత్రంలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తిరుగులేని విజయాల్ని సొంతం చేసుకుంటున్న మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. తాజగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబందించిన వార్త ట్రేడ్ విశ్లేషకులని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

బాంబులా పేలిన ధర
ఈ చిత్ర విడుదలకు ముందే నిర్మాతల చేతిలో 10 కోట్లు పడనున్నాయి. ఈ చిత్ర తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 9.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

కర్ణాటకలోనూ అదే జోరు
కర్ణాటక ప్రాంత హక్కులకు కూడా భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు కోటి రూపాయలకు కర్ణాటక ప్రాంత హక్కులు అమ్ముడయ్యాయట. మొత్తంగా 10 కోట్లకు పైనే బిజినెస్ జరుగుతోంది. శాటిలైట్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ ఎలాగు ఉన్నాయి.

ఫస్ట్ లుక్ తోనే
ఈ చిత్ర ఫస్ట్ లుక్ తోనే దర్శకుడు చందు ముండేటి ఆసక్తి పెంచారు. థ్రిల్లర్ చిత్రాన్ని తలపించేలా నాగ చైతన్య భారీగా చేతులతో కనిపిస్తున్నాడు. చందు ముండేటి థ్రిల్లర్ చిత్రాలని తీర్చి దిద్దడంలో ప్రసిద్ధి.

కీలక పాత్రలో
ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ కూడా ఉంది. ప్రముఖ నటుడు మాధవన్, సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మాధవన్ లాంటి నటుడు ఈ చిత్రంలో పాత్రకు అంగీకరించాడంటే దానికి ఉన్న ప్రాముఖ్యతని అర్థం చేసుకోవచ్చు.

అసలు కారణం
ఈ చిత్ర విడుదల ఎప్పటికపుడు వాయిదా పడుతూ వస్తోంది. సవ్యసాచి చిత్రం ఎప్పుడు విడులవుతుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. నిర్మాతలు త్వరలనే విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్ని రీ షూట్ చేయడం వలన ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











