మహేష్ పాట చరణంతో నాగచైతన్య టైటిల్
మహేష్ బాబు,భూమిక కాంబినేషన్లో వచ్చిన ఒక్కడు చిత్రంలోని నువ్వేం మాయ చేసావో గానీ అనే పాపులర్ సాంగ్ చరణం త్వరలో టైటిల్ గా వినపడనుంది. నాగచైతన్య,గౌతం మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ఈ టైటిల్ ని నిర్ణయించారని సమాచారం. ఇంతకుముందు జెస్సీ అనీ, నాతో రా అనే రకరకాల టైటిల్ అనుకున్నారు. అయితే చివరకు ఈ టైటిల్ దగ్గర ఆగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్య అసెస్టింట్ డైరక్టర్ గా చేస్తున్నారు. సమంతా అనే మోడల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అలాగే ఎ.ఆర్.రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పిబ్రవరి 14న రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. మహేష్ సోదరి మంజుల ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక నాగచైతన్య తన మూడో చిత్రానికి అజయ్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేయటానికి ముందుకొచ్చాడు.ఈ చిత్రం నాగార్జున హోమ్ బ్యానర్ కామాక్షి కళా మందిర్ బ్యానర్ పై రూపొందటానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ మేరకు కథా చర్చలు జరుగుతున్నాయి. ఇక నాగార్జున కూడా తన లేటెస్ట్ కేడీ చిత్రానికి కిరణ్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తున్నాడు. అలాగే నాగచైతన్య,అజయ్ కాంబినేషన్ చిత్రం జనవరి 2010లో ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











