twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి విషయాల్లో ఆమెనే సలహా అడుగుతా.. సమంతపై నాగ చైతన్య నాటీ కామెంట్స్

    |

    సమంత నాగ చైతన్య ఇంట్లో ఎలా ఉంటారో అందరికీ తెలియకపోవచ్చు గానీ సోషల్ మీడియాలో ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియానే ప్రపంచంగా తెగ రచ్చ చేస్తుంటుంది సమంత. తన ప్రపంచం ఏదో తానే అన్నట్టుగా సోషల్ మీడియాకు ఆమడ దూరంలో ఉంటాడు నాగ చైతన్య. అలా ఇద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అలాంటి నాగ చైతన్య తాజాగా ఓ కామెంట్ చేశాడు. తన కొత్త సినిమా లవ్ స్టోరీ ప్రమోషన్స్‌లో భాగంగా రానా నెంబర్ వన్ యారీ ప్రోగ్రాంకి గెస్ట్ వచ్చాడు నాగ చైతన్య.

    ఘాటైన వయ్యారాలతో షాక్ ఇస్తున్న మోక్షిత రాఘవ్

    రానాతో సందడి..

    రానాతో సందడి..

    రానా నంబర్ వన్ యారీ ప్రోగ్రాంలో లవ్ స్టోరీ టీం సందడి చేసింది. నాగ చైతన్య, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి ఇలా అందరూ వచ్చి రానాతో ఆట ఆడారు. రానా అడిగిన ప్రశ్నలకు ఈ ముగ్గురు వెరైటీ సమాధానాలు ఇచ్చాడు.

    అదే డ్రెస్..

    అదే డ్రెస్..

    తన షోకు గెస్ట్‌గా వచ్చిన శేఖర్ కమ్ములను రానా ఏడిపించేశాడు. లీడర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఏ డ్రెస్ వేసుకున్నారో ఇప్పుడు కూడా అదే డ్రెస్ వేసుకున్నారంటూ ఆట పట్టించాడు. అదే డ్రెస్ కాదు.. ఆ స్టైల్లోనే ఉంటుంది అంటూ శేఖర్ కమ్ముల కవర్ చేసేశాడు. అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదని శేఖర్ కమ్ముల గురించి రానా చెప్పుకొచ్చాడు.

    ఒకరి గురించి మరొకరికి..

    ఒకరి గురించి మరొకరికి..

    ఖర్ కమ్ముల, నాగ చైతన్యలు ఇద్దరూ ఒకరిని గురించి మరొకరు ఎంత తెలుసుకున్నారో తెలిసేలా ఓ ఆట ఆడించాడు. సినిమా సెట్‌లోనూ తామిద్దరం పాత్రల గురించి మాట్లాడుకున్నాం గానీ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకోలేదని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు.

    సోషల్ మీడియాలో సలహా..

    సోషల్ మీడియాలో సలహా..

    ఇక నాగ చైతన్యను ఇరుకున పెట్టేందుకు రానా ఓ ప్రశ్నను అడిగాడు. సోషల్ మీడియాలో సలహాలు కావాలంటే ఎవరిని సంప్రదిస్తావ్ అని నాగ చైతన్యను అడిగేశాడు. అలా రానా అడిగిన వెంటనే నాగ చైతన్య క్షణం ఆలస్యం చేయకుండా ఇంకెవరిని అడుగుతాను సమంతనే అని చెప్పుకొచ్చాడు.

    English summary
    Naga chaitanya seeks help From samantha,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X