సమంతతో రొమాంటిక్ గా ఉన్న ఫొటోను షేర్ చేసిన నాగచైతన్య.. సమంత మాత్రం ఊహించని విధంగా..

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో కూడా బెస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఒకప్పుడు మంచి క్రేజ్ అందుకున్న వారిలో సమంత నాగచైతన్య కూడా ఉన్నారు. వారికి సంబంధించిన ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉండేవి. ఇక వారు విడాకులు తీసుకున్న తర్వాత వారి సన్నిహితులు అలాగే అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అయితే ఇంటర్వ్యూలలో కూడా సమంత నాగ చైతన్య విడిపోవడానికి గల కారణాలను అయితే తెలియజేయలేదు. ఇక ఇటీవల మొదటి చాలా కాలం తర్వాత నాగచైతన్య సమంతకు సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

స్నేహం నుంచి పెళ్లి వరకు

స్నేహం నుంచి పెళ్లి వరకు

సమంత నాగచైతన్య ఎక్కడికి వెళ్ళినా కూడా వారిపై స్పెషల్ ఫోకస్ ఉండేది. మీడియా కూడా ఎక్కువగా వారి పైన ఫోకస్ పెట్టేది. ఆ విధంగా వారు సౌత్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ గా గుర్తింపును అందుకున్నారు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా మొదలైన వారి స్నేహం ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల రిలేషన్షిప్ తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు.

మతాలు వేరైనా..

మతాలు వేరైనా..

ఇక 2017లో సమంత నాగచైతన్య ఇరు కుటుంబాల సమక్షంలో గ్రాండ్ గా గోవాలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మతాలు వేరైనా కూడా ఏమాత్రం తేడాలు చూపకుండా రెండు పద్ధతుల్లోనూ వారి వివాహం చేసుకున్నారు. హిందూ క్రిస్టియన్ పద్ధతుల్లో చాలా అంగరంగ వైభవంగానే వారి పెళ్లి వేడుకలు జరిగాయి. ఆ ఫోటోలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

విడిపోవాలని నిర్ణయం

విడిపోవాలని నిర్ణయం

ఇక సమంత నాగ చైతన్య 2021 లో ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు అంతకుముందే చాలాసార్లు చర్చలు జరిపినప్పటికీ కూడా వీరిద్దరూ కూడా విడిపోవడానికి తుది నిర్ణయం తీసుకున్నారు. ఇక వారిద్దరి నిర్ణయాలను గౌరవించి నాగార్జున కుటుంబ సభ్యులు కూడా పాజిటివ్ గానే స్పందించారు.

 నాగచైతన్య రియాక్షన్

నాగచైతన్య రియాక్షన్

ఇక నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత పెద్దగా ఎక్కడా కూడా వారు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నది లేదు. ముఖ్యంగా సమంత అయితే ఎప్పుడూ కూడా నాగ చైతన్య పేరు ప్రస్తావించలేదు. కానీ నాగచైతన్య మాత్రం కొన్ని ఇంటర్వ్యూలలో బెస్ట్ పేయిర్ ఏది అన్నప్పుడు మాత్రం సమంత కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బెస్ట్ అనే నాగచైతన్య చాలా పాజిటివ్ గా స్పందించాడు.

ఫొటో షేర్ చేసిన నాగచైతన్య

ఫొటో షేర్ చేసిన నాగచైతన్య

అయితే ఇటీవల నాగచైతన్య సమంతతో ఉన్న ఒక లవ్లీ రొమాంటిక్ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం వైరల్ గా మారింది. ఆ ఫోటోను ఇప్పుడు ఎందుకు షేర్ చేయాల్సి వచ్చింది అంటే.. వీరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఏ మాయ చేసావో వచ్చి 13 ఏళ్ళు అయింది. ఇక ఆ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. నాగచైతన్యకు అదే మొదటి సక్సెస్ ఫిలిం కాగా సమంతకు అదే మొదటి సినిమా.

సమంత మాత్రం..

సమంత మాత్రం..

అయితే సమంత కూడా ఏ మాయ చేసావే సినిమా 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసుకుంది. కానీ కేవలం జెస్సి పాత్రకు సంబంధించిన లుక్స్ మాత్రమే ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఎక్కడ కూడా నాగచైతన్యకు సంబంధించిన ఆనవాళ్ళు ఆమె చూపించలేదు. ఇక వారి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X