చీపురు పట్టుకుని ఊడ్చిన నాగ చైతన్య.. కష్టాలు పడుతున్న హీరో
మజిలీ చిత్రంతో మంచి హిట్ కొట్టేశాడు నాగ చైతన్య. హీరోయిజం జోలికి పోకుండా కాస్త సహజత్వానికి దగ్గరగా ఉండే పూర్ణ పాత్రలో నాగ చైతన్య అద్భుతంగా నటించాడు. చై-సామ్‌లు పెళ్లైన తరువాత మొదటి సారి కలిసి నటించిన ఈ సూపర్ హిట్ కావడంతో మరోసారి లక్కీ పెయిర్ అని నిరూపించుకున్నారు. ఈ చిత్రంలో చైతూ రా లుక్‌కు మంచి స్పందన వచ్చింది.

మజిలీతో మరుపురాని హిట్..
మజిలీ చిత్రంతో నాగ చైతన్య-సమంత కలిసి చేసిన మ్యాజిక్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. శ్రావణి పాత్రకు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. శ్రావణి లాంటి భార్య కావాలని సోషల్ మీడియాలో అప్పట్లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. పూర్ణ పాత్రలో చైతన్య ఒదిగిపోయిన తీరుకు ప్రశంసలు దక్కాయి.

మరోసారి మ్యాజిక్ క్రియేట్..
మరోసారి అలాంటి మ్యాజిక్‌కు క్రియేట్ చేసేందుకు వస్తున్నాడు. అయితే ఈ సారి సాయి పల్లవితో కలిసి రాబోతోన్నాడు. అది కూడా ఫిదా లాంటి సూపర్ హిట్ తీసిన శేఖర్ కమ్ముల నేతృత్వంలో. శేఖర్ కమ్ముల సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలతోనే చిత్రాలను తెరకెక్కిస్తారన్న సంగతి తెలిసిందే.
చైతు ఫస్ట్ లుక్..
తాజాగా చైతు మళ్లీ రా లుక్‌ను ట్రై చేశాడు. శేఖర్ కమ్ముల చిత్రంలో చైతూ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. చైతు పుట్టిన రోజు సందర్భంగా శేఖర్ కమ్ముల చిత్రానికి సంబంధించి అతని పాత్రకు సంబంధించిన నేపథ్యాన్ని పరిచయం చేశాడు.

చైతు ప్రపంచాన్ని పరిచయం చేసిన యూనిట్..
నాగ చైతన్య ప్రపంచాన్ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య మరింత రా లుక్‌లో కనిపిస్తున్నాడు. సాధారణ కుటుంబంలోని కుర్రాడిలా ఇంట్లో చీపురు పట్టుకుని ఊడుస్తున్నాడు. బీరువాలో ఉన్న డబ్బులు లెక్కపెట్టుకుంటున్నాడు. పిల్లలతో ఆడుకుంటూ సంతోషంగా ఉన్నట్లు, ఏదో తెలియని గతం కూడా ఉన్నట్లు, దాన్ని తలుచుకుని బాధపడుతున్నట్లు ఇలా అతనికి సంబంధించిన భావోద్వేగాలన్నింటిని చూపించాడు.
Recommended Video

సమంత కామెంట్స్..
చైతూ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ మేరకు సాయి పల్లవి ట్వీట్ చేస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియోను షేర్ చేసింది. సమంత కూడా ఈ వీడియోను షేర్.. లుక్ చాలా బాగుందంటూ భర్తకు, మూవీ యూనిట్‌కు కంగ్రాట్స్ తెలిపింది.


Click it and Unblock the Notifications











