For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Naga Chaitanya: శోభిత ధూళిపాళతో నాగ చైతన్య డేటింగ్?.. ఆమెనైనా మోసం చేయకంటూ ట్వీట్

  |

  టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి యావత్ సినీ లోకానికి షాక్ ఇచ్చారు. టాలీవుడ్ క్యూట్ పెయిర్, ఎంతో అన్యూన్యంగా ఉన్న ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుందని ఇప్పటికీ ఎంతోమందికి అంతుచిక్కని ప్రశ్నే. అయితే అది వారి వ్యక్తిగత వ్యవహారమే అయినా సినీ ప్రేక్షకులు, సాధారణ ప్రజలు ఈ విషయం మీద ఎక్కువగా ఆసక్తి కనబరిచారు. ఇక వారి విడాకుల కారణాలు ఇవే అంటూ ఎన్నో ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈ వార్తల తర్వాత నాగా చైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళతో ప్రేమలో ఉన్నాడని ఓ టాక్ నడిచింది. ప్రస్తుతం మళ్లీ ఆ టాపిక్ తెరపైకి వచ్చింది. ఆ వివరాళ్లోకి వెళితే..

   ఆకట్టుకున్న చైతూ-సామ్ రొమాన్స్..

  ఆకట్టుకున్న చైతూ-సామ్ రొమాన్స్..

  అక్కినేని నట వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య జోష్ చిత్రంతో తెరంగేట్రం చేశాడు. మరోవైపు ఏ మాయ చేశావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. అయితే నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం ఇద్దరికీ మంచి సక్సెస్ ఇచ్చంది. ముఖ్యంగా ఈ సినిమాలో వీరిద్దరి రొమాన్స్, కెమిస్ట్రీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. తర్వాత అనేక సినిమాల్లో కలిసిన నటించిన ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు

  నాలుగేళ్లకు ముగింపు..

  నాలుగేళ్లకు ముగింపు..

  కొంత కాలానికి సమంతను నాగ చైతన్య పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషం తెలిసిందే. వారి పెళ్లి అట్టహాసంగా రెండు పద్ధతుల్లో జరిగింది. తర్వాత నాలుగేళ్లకు వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వారిద్దరు ఎట్టకేలకు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. వారు ప్రకటించిన తర్వాత కూడా వారి విడాకుల గురించి అనేక చర్చలు జరిగాయి. అనేక ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అయితే ఎందుకు విడిపోయారు అనే విషయంపై ఇప్పటికీ సరైనా క్లారిటీ లేదనే చెప్పాలి.

  శోభిత ధూళిపాళతో డేటింగ్..

  శోభిత ధూళిపాళతో డేటింగ్..

  అయితే సమంత మరెవరితోనూ కలిసి ఉందని అందుకే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని అప్పట్లో ప్రచారం జరిగింది. సదరు వ్యక్తి తాను సమంతను అక్క అని పిలుస్తానని మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈ విషంపై సమంతపై అనేక మంది నెటిజన్లు ట్రోలింగ్ కూడా చేశారు. ఈ వ్యవహారం తర్వాత కొద్దిరోజులకు అడివి శేష్ గూఢచారి ఫేమ్ శోభిత ధూళిపాళతో నాగ చైతన్య ప్రేమలో పడ్డాడని, త్వరలో పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉందని ప్రచారం విపరీతంగా జరిగింది.

   నవ్వడం కంటే ఏం చేయలేను..

  నవ్వడం కంటే ఏం చేయలేను..

  నాగ చైతన్యతో డేటింగ్ పై స్పందించిన శోభిత ధూళిపాళ ఓ వీడియోతో సమాధానం ఇచ్చినట్లు నెటిజన్లు భావించారు. ఆ వీడియోలో శోభిత మిడిల్ ఫింగర్ చూపిస్తూ డేటింగ్ వార్తలపై సీరియర్ అయినట్లు అనుకున్నారు. అలాగే లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో ఈ రూమర్లపై నాగ చైతన్యకు ప్రశ్న ఎదురైంది. అప్పుడు చైతూ నవ్వడం కంటే ఏం చేయలేను చెప్పాడు. అలా నాగ చైతన్య నవ్వడం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

  పక్కపక్కనే నిల్చున్న ఫొటో..

  ఇప్పుడు నాగ చైతన్య-శోభిత ధూళిపాళ డేటింగ్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాజాగా సోషల్ మీడియాలో నాగ చైతన్య, శోభిత పక్కపక్కనే నిల్చొని ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. అయితే ఈ పిక్ పై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా వీళ్లిద్దరు పక్క పక్కనే ఉన్న ఫొటోలను కట్ చేసి పెట్టినట్లుగా మరో ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ లో "ఆహా.. త్వరలోనే అఫిషియల్ చేసేలా ఉన్నారుగా" అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

  ఆమెను అయినా మోసం చేయకు..

  ఇక మరో యూజర్ చైతూ-శోభిత పక్కపక్కనే నిల్చుని ఉన్న పిక్ షేర్ ట్విటర్ లో షేర్ చేశాడు. ఈ ఫొటో షేర్ చేస్తూ.. "నాకు చాలా సంతోషంగా ఉంది. శోభిత అక్కినేనికి అక్కర్లేని ఫ్యాన్స్ అర్హులు. సమంత డ్రెస్సింగ్ గురించి వాగిన ప్రతి కుక్కకి కొత్త వదిన మంచి స్టఫ్ ఇస్తది. బెస్ట్ ఛాయిస్ అక్కినేని నాగ చైతన్య. కనీసం ఆమెను అయినా మోసం చేయకపోతే చాలు. ఈ అమ్మాయి కూడా బాధపడటం నాకు ఇష్టం లేదు" అని రాసుకొచ్చాడు ఆ యూజర్.

  సామ్ డ్రెస్సింగ్, రోల్స్ పై కామెంట్స్..

  సామ్ డ్రెస్సింగ్, రోల్స్ పై కామెంట్స్..

  అంటే నాగ చైతన్య, అతని ఫ్యాన్స్ పై వెటకారంగా ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. సమంతతో నాగ చైతన్య విడాకుల అనంతరం సామ్ డ్రెస్సింగ్, రోల్స్ గురించి వివిధ రకాలుగా ట్రోలింగ్ వచ్చిన విషయం తెలిసిందే. సామ్ వేసుకునే డ్రెస్సెస్ పై, ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో రోల్ అండ్ యాక్టింగ్ గురించి పలువురు నెగెటివ్ గా కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని సదరు యూజర్ ఇలా రాసుకొచ్చినట్లు తెలుస్తోంది.

  English summary
  Once Again Naga Chaitanya Sobhita Dhulipala Dating Rumours Goes Viral By Latest Photo
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X