Sobhita Marriage: శోభితా ధూళిపాల.. నాగచైతన్య మ్యారేజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

సినీ పరిశ్రమలో సాధారణంగా చాలామంది హీరో హీరోయిన్స్ పెళ్లిళ్లు, ప్రేమలు లాంటివి చూస్తూనే ఉంటాము. అలా ప్రతి ఇండస్ట్రీలో కూడా ఇది కామన్ గానే కనిపిస్తుంది. అలా చాలా మంది స్టార్ జంటలకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుంది. అలా మన తెలుగు సినిమా నుంచి కూడా చాలా మందే ఉండేవారు కాగా ఆ స్టార్ అండ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య అలాగే హీరోయిన్ సమంతల జోడి కూడా ఒకటి.

కొన్నేళ్లు బాగానే ఉన్న వీరు తర్వాత దూరం పెంచుకొని మొత్తానికి విడాకులు తీసుకొని సెపరేట్ అయ్యిపోయి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కాగా ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత సమంత తన రిలేషన్ షిప్ పరంగా ఎలాంటి స్టెప్ తీసుకోలేదు కానీ నాగ చైతన్య మాత్రం స్టెప్ తీసేసుకున్నాడు.

naga chaitanya sobhita marraige date details are here

తన కొత్త భాగస్వామిగా పాన్ ఇండియా సహా హాలీవుడ్ సినిమాలు కూడా చేసిన ప్రముఖ నటి అందులోని తెలుగు అమ్మాయి అయినటువంటి బ్యూటీ శోభిత ధూళిపాళని పెళ్లి చేసుకున్నట్టుగా పెద్దల సమక్షములో ఖరారు అయ్యింది. అయితే ఈ కొన్ని నెలల కితమే అనౌన్సమెంట్ వచ్చిన తర్వాత నాగ చైతన్య మాజీ భార్య సమంత విషయంలో పలు షాకింగ్ వార్తలు అక్కినేని కుటుంబంపై వచ్చిన ఆరోపణలు సంచలనం రేపాయి.

అలా వీరి పేర్లు ఏదొకలా వార్తల్లో వినిపిస్తూనే వచ్చాయి. ఐతే ఇక్కడ నుంచి మరో టర్న్ ఇపుడు తీసుకుంది. ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ యువ జంట ఇపుడు తమ పెళ్ళికి సిద్ధం అయ్యినట్టుగా తెలుస్తుంది. కాగా లేటెస్ట్ సమాచారం ప్రకారం డేట్, వేదిక కూడా ఫిక్స్ అయ్యిపోయాయట. ఐతే ఈ డిసెంబర్ 4న ఈ యువ జంట పెళ్లితో ఒకటి కానుండగా ఎక్కడో కాకుండా హైదరాబాద్ లోనే రెండు కుటుంబాలు ఈ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట.

naga chaitanya sobhita marraige date details are here

అలాగే ఈ పెళ్ళికి వారు ఎలాంటి హంగులు, ఆర్భాటాలు చేయకూడదు అని ఫిక్స్ అయ్యారట. చాలా సింపుల్ గా కేవలం లిమిటెడ్ కుటుంబీకులు అతిథులు సమక్షంలో ఈ పెళ్లి చేయాలని ఫిక్స్ చేశారట. సో మొత్తానికి ఇలా ఈ యువ జంట పెళ్ళికి సన్నాహాలు జరుగుతున్నాయి అని చెప్పాలి. మరి వీరి పెళ్ళికి సంబంధించి ముందు ముందు మరింత సమాచారం రావాల్సి ఉంది.

కాగా ఓ పక్క నాగ చైతన్య తన కెరీర్ భారీ సినిమా "తండేల్" లో బిజీగా ఉండగా శోభిత కూడా తెలుగు సహా హిందీ సినిమాలు ఇంకా వెబ్ సిరీస్ లు చేస్తుంది. అలాగే చై తండేల్ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కి ప్లాన్ చేసారు కానీ ఇది ఈ ఏడాదిలో రాదు అని దర్శకుడు చందూ మొండేటి తెగేసి చెప్పేసాడు. సో ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆ డేట్ ఇపుడు సస్పెన్స్ గా మారింది. అలాగే ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి నటిస్తుంది.

More from Filmibeat

Read more about: naga chaitanya samantha thandel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X