Naga Chaitanya Sobhita Wedding: ఘనంగా శోభిత, చైతూల పెళ్లి.. హజరయ్యే గెస్టులు వీళ్లే..
Naga Chaitanya-Sobhita Wedding: అక్కినేని వారింట పెళ్లి సందడి నెలకొంది. అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్య -హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం రేపు బుధవారం(డిసెంబర్ 4) రాత్రి వీరి వివాహం జరగబోతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి. అయితే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యే సెలబ్రిటీలు ఎవరెవరు అనే విషయం పై ఆసక్తి నెలకొంది.
నాగ చైతన్య, శోభితాలు గత రెండు ఏండ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ముంబైలో జరిగిన ఓ పోటీకి ఈవెంట్లో శోభితాను తొలిసారి కలుసుకున్నామని, ఆ మాటల్లోనే తన మంచి మనసు తనను కట్టిపడేసిందని అన్నారు. మా ఇద్దరికీ ఎన్నో ఉమ్మడి పోలికలు ఉన్నాయని, ఒకరికొకరం బాగా అర్థం చేసుకున్నామని నాగ చైతన్య అన్నారు. శోభితా కుటుంబానికి ఎంతో ప్రాధాన్య ఇస్తుందని తెలిపారు. అందుకే ఆమెతో కలిసి జీవితం పంచుకోటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా అని నాగచైతన్య అన్నారు.

ఇక శోభిత.. నాగ చైతన్యపై తన అభిప్రాయాన్ని చెబుతూ.. తను చాలా కూల్ గా కామ్ గా ఉంటాడని, ఆడంబరాలని ప్రదర్శించడని, అందరితో హుందాగా వ్యవహరిస్తుంటాడని, ఎంతో గౌరవం ఇస్తాడని ఆ లక్షణాలే తనకు బాగా నచ్చాయని శోభిత వెల్లడించారు. ఇదెలా ఉంటే.. ఇప్పటికే నాగ చైతన్య, శోభితాల హాల్దీ సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. సంప్రదాయకట్టులో మెరిసిపోతూ మరింత అందంగా కనిపించారు.
ఇక అక్కినేని నాగచైతన్య శోభితాల వివాహం రేపు బుధవారం డిసెంబర్ 4 రాత్రి 8:13 నిమిషాలకు జరగబోతుంది. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. అక్కినేని కుటుంబం ప్రత్యేకంగా భావించే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ పెళ్లి వేడుక నిర్వహించనున్నారు. నేడు నాగ చైతన్యను పెళ్లి కొడుకుని చేయడం, శోభితాను కూతురిని చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే చైతూ శోభితాల మ్యారేజ్‌కి సెలబ్రిటీలు ఎవరెవరు హాజరవుతారనే ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం లేదు. కానీ అందిన సమాచారం మేరకు చాలా తక్కువ మంది గెస్ట్ లు హాజరయ్యే అవకాశం ఉందట. ఇరు కుటుంబాలు పెద్దలు, వారి దగ్గరి బంధువులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతారని తెలుస్తుంది.
ఇక వీరితోపాటు అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, అమల, అఖిల్, సుమంత్, సుశాంత్, సుశీలమ్మ ఇలా అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ హాజరవుతారు. వీరితోపాటు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి హీరో వెంకటేష్, సురేష్‌బాబు, రానా, అభిరామ్ వారి కుటుంబ సమేతంగా హాజరు కాబోతున్నారు. ఇక నాగచైతన్య అమ్మ లక్ష్మి, తన భార్తతో సహా హాజరు కాబోతున్నారట.
ఇక ఇండస్ట్రీ పరంగా చూస్తే.. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతుందట. అలాగే..తండేల్ మూవీ యూనిట్ పెళ్లికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది.అంటే హీరోయిన్ సాయి పల్లవి కూడా నాగ చైతన్య పెళ్లికి రాబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. వైఎస్ జగన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వేడుకకు హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పటి వరకూ రిసెప్షన్ కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.


Click it and Unblock the Notifications











