Custody Twitter Review: నాగ చైతన్య ఖాతాలో మరొకటి.. మంచి పాయింటే కానీ.. ఇంతకీ కస్టడీ హిట్టేనా అంటే!

ఫిల్మ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా.. ఎప్పటికప్పుడు కష్టపడుతూ.. తనలోని టాలెంట్లను బయటకు తీసుకువస్తూ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపుతో సాగిపోతోన్నాడు యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ఆ మధ్య వరుసగా హిట్లను అందుకున్న అతడు.. ఇప్పుడు మాత్రం ఇబ్బంది పడుతోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని 'కస్టడీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రానికి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చింది? నాగ చైతన్య హిట్‌ను కొట్టాడా? లేదా? అనేవి చూద్దాం పదండి!

'కస్టడీ' అంటూ వచ్చేశాడు:యువసామ్రాట్ నాగ చైతన్య నటించిన తాజా చిత్రమే 'కస్టడీ'. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చారు.

Naga Chaitanya Starrer Custody Movie Twitter Review

అలాంటి కథ... ఫుల్ యాక్షన్‌:'కస్టడీ' సినిమా ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ గురించి సాగే కథతో తెరకెక్కింది. తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? ప్రత్యర్ధితో అతడు ఎలా పోరాటం చేశాడు? ఈ క్రమంలోనే తన ప్రేమకు ఎదురైన ఆటంకాలు ఏంటి? అనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా పెట్టినట్లు ఇప్పటికే తెలిసింది.

ఫస్టాఫ్ డల్‌గానే ఉందంటూ:అక్కినేని నాగ చైతన్య నటించిన 'కస్టడీ' మూవీని చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అందులో 'కస్టడీ మూవీ ఫస్టాఫ్ ఏవరేజ్‌గా ఉంది. ఈ సినిమా చాలా నెమ్మదిగా, ఫ్లాట్‌గానే ప్రారంభం అవుతుంది. అయితే, ప్రీ ఇంటర్వెల్ ముందు మాత్రమే కొంత ఆసక్తికరంగా సాగుతుంది. పాటలు చాలా నిరాశ పరుస్తాయి. సెకెండాఫ్ బాగుండాలి' అన్నాడు.

ఎంగేజింగ్ చేసే మూవీ అని:'కస్టడీ' సినిమాను చూసిన ఇంకొక నెటిజన్ ట్విట్టర్‌లో 'కస్టడీ మూవీ ఎన్నో మలుపులు, ట్విస్టులతో సాగే ఆకర్షణీయమైన థ్రిల్లర్. అంతలా డైరెక్టర్ వెంకట్ ప్రభు దీన్ని రియలిస్టిక్‌గా చూపించాడు. నాగ చైతన్య నటన అద్భుతంగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లో బాగా చేశాడు. అరవింద్ స్వామి చాలా మొరటుగా కనిపించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది' అని చెప్పుకొచ్చాడు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలా:'కస్టడీ' సినిమా వీక్షించిన మరొక నెటిజన్ ట్విట్టర్ ఖాతాలో 'కస్టడీ.. బిలో ఏవరేజ్ ఫస్టాఫ్. అలాగే ఏవరేజ్ సెకెండాఫ్. ఫస్టాఫ్‌లో కంటెంట్ 15 నిమిషాలే ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్ అస్సలు కనెక్ట్ కాదు. యాక్షన్ సీక్వెన్స్‌లు రిపీట్‌గా వస్తుంటాయి. మొత్తంగా ఇందులో రెండు కొత్త సన్నివేశాలు కనిపించాయి. ట్విస్టులు బాగున్నాయి. చైతూ బాగా చేశాడు' అంటూ రాసుకొచ్చాడు.

అవకాశం మిస్ అయిందని:'కస్టడీ' మూవీపై మరో నెటిజన్ ఇలా స్పందించాడు. 'కస్టడీ ఏవరేజ్ ఫిల్మ్. ఈ చిత్రం 90 దశకం నాటి కథతో నడుస్తుంది. మంచి అవకాశం కోల్పోయిన దానికి ఇదే ఉదాహరణ. అనవసరమైన సాంగ్స్ ఫస్ట‌ాఫ్‌ను డల్ చేసేశాయి. సెకెండాఫ్ మంచిగా మొదలైనా అది కూడా డౌన్ అయింది. మొత్తంగా ఇది చెత్త సినిమా కాదు. కానీ, అంచనాలను మాత్రం అందుకోదు' అని చెప్పాడు.

బిలో ఏవరేజ్ మూవీ అని:నాగ చైతన్య 'కస్టడీ' మూవీని వీక్షించిన మరో నెటిజన్ 'కస్టడీ మూవీ ఓవరాల్‌గా బిలో ఏవరేజ్‌గా ఉంది. మంచిగా డిజైన్ చేసిన కొన్ని సీన్స్‌తో ఆసక్తికరమైన ప్లాట్ పాయింట్ బాగుంది. కానీ, మిగిలిన భాగమంతా డల్‌గా ఉంది. చాలా చోట్ల రిపీట్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉణ్నాయి. చాలా ఫ్లాట్‌గా సాగుతుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటలు బాలేదు. నా రేటింగ్ 2.25/5' అన్నాడు.

Naga Chaitanya Starrer Custody Movie Twitter Review

ఓవరాల్‌గా ఎలా ఉందంటే:'కస్టడీ' మూవీకి సంబంధించిన షోలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లు ప్రకారం.. ఈ సినిమాకు దాదాపుగా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో ట్విస్టులు బాగున్నా.. అనవసరంగా వచ్చే సాంగ్స్ ఫ్లోను తగ్గించాయని అంటున్నారు. ముఖ్యంగా సెకెండాఫ్ ప్రెడిక్టబుల్‌గా ఉందని చెప్తున్నారు. కానీ, నాగ చైతన్య ఫ్యాన్స్‌కు మాత్రం ఇది నచ్చుతుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X