నాగ చైతన్య బర్త్ డే స్పెషల్...

By Bojja Kumar

హైదరాబాద్: ఏమాయ చేసావె, 100% లవ్, తడాఖా, మనం వంటి సూపర్ హిట్ చిత్రాల హీరో నాగ చైతన్య కథానాయకుడిగా, 1 నేనొక్కడినే ఫేం కృతి సనన్ హీరోయిన్‌గా, స్వామి రారా వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ నిర్మించిన బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రియలన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై ఈచిత్రం నిర్మాణం జరుపుకుంటోంది.

నాగ చైతన్య పుట్టినరోజు నవంబర్ 23. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల చేసారు. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ....‘అత్తారింటికి దారేది తర్వాత మా బేనర్లో స్వామి రారా టెక్నీషియన్స్‌తో చేస్తున్న సినిమా ఇది. నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా విషెస్ తెలుపుతూ ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేస్తున్నాం. నాగ చైతన్య చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. స్టైలిష్ గా ఉండే కమర్షియల్ ఎంటర్టెనర్ ఇది. అతని కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది. ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కి కూడా బాగా నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. షూటింగు అంతా చాలా సరదాగా జరుగుతుంది. పాటలు తప్ప టోటల్ టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. పీటర్ హెయిన్స్ సారథ్యంలో ఒక థ్రిల్లింగ్ చేజ్ జరుగుతోంది' అన్నారు.

నాగ చైతన్య సరసన కృతి సానన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, రవి బాబు, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్: నారాయణరెడ్డి, కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బీవిఎస్ఎన్ ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుధీర్ వర్మ.

Naga Chaitanya - Sudheer Varma film teaser

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X