»   » నాగార్జున, అల్లు అరవింద్ సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసారు

నాగార్జున, అల్లు అరవింద్ సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. మరో మూడు పాటలను మాత్రం చిత్రించాల్సి ఉంది. ఈ సందర్బంగా చిత్ర విశేషాలను నిర్మాత బన్నీ వాసు మీడియా తెలియచేస్తూ.. "సుకుమార్ చెప్పిన కథ విని నాగార్జున, అల్లు అరవింద్ సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశారు. అంతటి పటిష్టమైన కథ ఇది. చైతన్య జోడీగా తమన్నా నటిస్తోంది.దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సుకుమార్, దేవి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన చిత్రాల ఆడియో కన్నా ఈ సినిమాలోని పాటలు మరింతగా ఆకట్టుకుంటాయి. నాగచైతన్యను సుకుమార్ కొత్త కోణంలో చూపిస్తున్నారు. నాగచైతన్య స్టిల్స్ ఇప్పటికే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అటు యూత్ ను, ఇటు ఫ్యామిలి ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది" అని అన్నారు.

అలాగే కాలేజీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. గ్యారెంటీగా ఈ చిత్రం చూసిన వారు ప్రెష్ గా ఫీలవుతారు అని చెప్తున్నారు. యువతకు నచ్చే స్టైలింగ్, మ్యానరిజమ్స్ ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య తాత నాగేశ్వరావు హిట్ ప్రేమాభిషేకం లోని నా కళ్ళు చెప్తున్నాయి...నిన్ను ప్రేమిస్తున్నాయని..నా హృదయం చెప్తోంది అనే పాటను రీమిక్స్ చేసి షూట్ చేసారు. ఇంకా టైటిల్ ఏమిటన్నదే నిర్ణయం కాలేదు. నాగచైతన్య తన దర్సకుడు సుకుమార్ డెడికేటెడ్ డైరక్టర్. అయితే ఆ విషయం స్క్రిప్టు నేరేట్ చేస్తున్నప్పుడే అనుభవంలోకి వచ్చింది అంటున్నారు. సమర్పణ: అల్లు అరవింద్, దర్శకత్వం: సుకుమార్, నిర్మాత: బన్నీ వాసు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu