»   » నాగచైతన్య, సుకుమార్ కాంబినేషన్ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో...

నాగచైతన్య, సుకుమార్ కాంబినేషన్ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, సుకుమార్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రం ఫిప్టీ పర్శంట్ పూర్తయింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. గ్యారెంటీగా ఈ చిత్రం చూసిన వారు ప్రెష్ గా ఫీలవుతారు అని చెప్తున్నారు. యువతకు నచ్చే స్టైలింగ్, మ్యానరిజమ్స్ ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని చెప్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ చిత్రం గురించి హీరో నాగచైతన్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అతను మాట్లాడుతూ...నేను గీతా ఆర్ట్స్ లో చేయటం ఆనందంగా ఉంది. చాలా మంది మంచి టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. అలాగే సుకుమార్ డెడికేటెడ్ డైరక్టర్. అయితే ఆ విషయం స్క్రిప్టు నేరేట్ చేస్తున్నప్పుడు అనుభవంలోకి వచ్చింది. నా మూడో చిత్రాన్ని ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలనుకున్నాను. అయితే ఈ స్క్రిప్టు విన్నాక ఆ నిర్ణయం మార్చుకున్నాను. ప్రతీ ఒక్కరికీ నచ్చే ఎలమెంట్ ఈ స్క్రిప్టులో ఉంది అంటున్నారు. ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పటమే ఈ చిత్రం భవిష్యత్ ఏమిటన్నది, ఏ రేంజ్ హిట్టవుతున్నదన్నది తెలుస్తుంది అంటున్నారు. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య తాత నాగేశ్వరావు హిట్ ప్రేమాభిషేకం లోని .నా కళ్ళు చెప్తున్నాయి...నిన్ను ప్రేమిస్తున్నాయని..నా హృదయం చెప్తోంది అనే పాటను రీమిక్స్ చేసి షూట్ చేసారు. ఇంకా టైటిల్ ఏమిటన్నదే నిర్ణయం కాలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu