twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగచైతన్య, సుకుమార్ చిత్రం ఓపెనింగ్ విశేషాలు

    By Srikanya
    |

    నాగచైతన్య, సుకుమార్ కాంబినేషన్ చిత్రం ఈ రోజు(సోమవారం) ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంచ్ అయింది. బన్నీ వాసు నిర్మాతగా పరిచయం అవుతున్న ఈ చిత్రం గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవనుంది. అల్లు అరవింద్ సమర్పస్తున్న ఈ చిత్రం గీతా ఆర్ట్సకి ప్రొడక్షన్ నెంబర్ 31. దేవీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పూజ ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు చేసారు. నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నాగార్జున క్లాప్ కొట్టారు. దర్సకుడు ఎస్.ఎస్.రాజమౌళి మొదటి షాట్ కి దర్శకత్వం వహించగా.. నాగచైతన్య తాతగారైన అక్కినేని నాగేశ్వరరావు దర్శకుడుకి స్క్రిప్టు అందించారు.

    ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ...నేను రెండున్నరేళ్ళ క్రితమే ఈ కథని విన్నాను. సుకుమార్ ఎప్పుడూ తను తయారు చేసుకున్న కథలు మొదట నాకే చెబుతాడు. నాకు సుకుమార్ అంటే చాలా ఇష్టం. అతని దగ్గర ఒక్కో కథకి నాలుగైదు వెర్షన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటాయి. అలాగే మేము నాగచైతన్యని ఏ మాయ చేసావేకి ముందు హీరోగా అనుకున్నాము. సుకుమార్ ఈ కథని నాగార్జునకి, నాగచైతన్యకి చెప్పి ఒప్పించుకున్నాడు.

    ఇక తమన్నా విషయానికి వస్తే హ్యాపీడేస్ చిత్రం చూసి నేను తమన్నాను గీతా ఆర్ట్స్ కి డేట్స్ తీసుకున్నాను. మొదట మగధీరకు ఆమే చేయాల్సింది. అయితే ఆ పాత్రకు సరిపోదని చేయలేదు. అలాగే నాగచైతన్య చాలా తెలివైన కుర్రాడు. గీతా ఆర్ట్స్ ఇంతకుముందుకూడా బయిట హీరోలతో సినిమాలు చేసింది..భవిష్యత్ లో కూడా చేస్తుంది అన్నారు.

    ఇక హీరో నాగచైతన్య మాట్లాడుతూ...నేను గీతా ఆర్ట్స్ లో చేయటం ఆనందంగా ఉంది. చాలా మంది మంచి టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. అలాగే సుకుమార్ డెడికేటెడ్ డైరక్టర్ అనీ విన్నాను..అయితే ఆ విషయం స్క్రిప్టు నేరేట్ చేస్తున్నప్పుడు అనుభవంలోకి వచ్చింది. నా మూడో చిత్రాన్ని ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలనుకున్నాను. అయితే ఈ స్క్రిప్టు విన్నాక ఆ నిర్ణయం మార్చుకున్నాను. ప్రతీ ఒక్కరికీ నచ్చే ఎలమెంట్ ఈ స్క్రిప్టులో ఉంది అన్నారు.

    తమన్నా మాట్లాడుతూ...నేను ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత స్టైయిట్ చిత్రం చేస్తున్నాను. గీతా ఆర్ట్స్ లో చేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇందులో నాది ఫెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ అంది.

    దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ..నేను ఎప్పుడూ నా కథలన్నీ అల్లు అరవింద్ గారికి మొదట నేరేట్ చేస్తూంటాను. ఈ కథ రాసేటప్పుడు నా మనస్సులో ఏ హీరోనూ లేడు. అయితే ఆర్య 2 రాసేటప్పుడు మాత్రం అల్లు అర్జునే నా మనస్సులో ఉన్నాడు. నేను తమన్నా అయితే బావుటందన్నాను. అలాగే నాగచైతన్య నటన ఏమి మాయ చేసావే లో బాగా నచ్చింది. ఇక ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఏక్షన్ ఎంటర్టైనర్.

    నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ...బన్నీ(అల్లు అర్జున్) ఈ కథ విని అల్లు అరవింద్ కు రికమెండ్ చేసారు. అల్లు అరవింద్ గారు కథ విని నాగచైతన్య పేరు సజెస్ట్ చేసారు. నా మొదటి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో చేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X