ఈ రోజే నాగచైతన్య కొత్త చిత్రం ప్రారంభం
మల్టి డైమన్షన్ సమర్పణలో నాగచైతన్య, హన్సిక, సునీల్ ప్రధాన తారాగణంగా రూపొందనున్న చిత్రం ఈ రోజు మొదలైంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ రోజు జరిగింది. కొంచెం ఇష్టం... కొంచెం కష్టం దర్శకుడు పి.కిషోర్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్.ఎస్.ధమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి.
పూజ అనంతరం తొలి సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ ఇవ్వగా, డి.రామానాయుడు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. వివి వినాయిక్ గౌవర దర్శకత్వం వహించగా మొదటి షాట్ ని చిత్రీకరించారు. తమిళ వెట్టై చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, జూలై ఫస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు.
తమిళంలో హిట్టైన 'వెట్టై'చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. యు.టీవి వారి వద్దనుంచి బెల్లంకొండ రైట్స్ తీసుకున్నారు. మాధవన్, ఆర్య, సమీరారెడ్డి, అమల పాల్ ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందిన 'వెట్టై' మంచి విజయం సాధించింది. తెలుగు వెర్షన్ కి దర్శకుడుగా డాలీని ఎన్నుకున్నారు. కొంచెం ఇష్టం..కొంచెం కష్టం చిత్రంతో దర్శకుడుగా మారిన డాలికి ఇది రెండో చిత్రం.
నాగచైతన్య... తమ్ముడుగాకీ క్యారెక్టర్ ని చేస్తూండగా, సునీల్.. సెకండ్ హీరో పాత్రను చేస్తున్నారు. తమిళంలో ఆర్య.. పాత్రను నాగచైతన్య, మాధవన్ పాత్రను సునీల్ చేస్తున్నారు. ఆటోనగర్ సూర్య చేస్తున్న నాగచైతన్యకు తదుపరి చిత్రం ఇదే. ఇక సునీల్ ఇప్పటికే మాధవన్ నటించిన తను వెడ్స్ మను రీమేక్ లో చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ, బ్లేడ్ బాబ్జీ చిత్రాలు చేసిన దేవి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.
ఇక వెట్టై చిత్రం యాక్షన్, ప్రేమ, సెంటిమెంట్ సమాహారంతో రూపొందింది. ఈ చిత్రంలో మాధవన్, ఆర్య నటన, సమీరా రెడ్డి, అమలా పాల్ అందచందాలు, అభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే యువన్ సంగీతం పెద్ద ఎస్సెట్ అయింది. ప్రస్తుతం లింగు సామి దర్శకత్వంలోనే హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. హిందీ వెర్షన్ కి షాహిద్‌కపూర్ హీరోగా నటించనున్నారు. ఇతర నటీనటుల సంగతి తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











