నాగచైతన్య ‘తడాఖా’ విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్: నాగచైతన్య-సునీల్ కాంబినేషన్‌లో తమిళంలో విజయవంతమైన 'వెట్టై' చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెలుగులో 'తడాఖా' టైటిల్ తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పి. కిశోర్‌కుమార్(డాలి) దర్శకుడు. నాగ చైతన్య సరసన తమన్నా, సునీల్ సరసన ఆండ్రియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మే 10న ఈ చిత్రం విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం లోని పాటలు ఇప్పటికే విడుదలై మంచి సక్సెస్ అయ్యాయి. గతంలో పలు చిత్రాల్లో వానపాటల్లో సెక్సీగా అందాలు ఆరబోసిన తమన్నా 'తడాఖా' సినిమాలో కూడా వాన పాటలో చిందేస్తోంది. ఇక సినిమా కాన్సెప్టులోకి వెళితే ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో నాగచైతన్య అల్లరి తమ్ముడిగా, సునీల్ పిరికి పోలీస్ గా కనిపించనున్నారు.
బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అశుతోష్ రాణా, నాగినీడు, ఆహుతిప్రసాద్, జయప్రకాష్‌రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మూలకథ: లింగుస్వామి, మాటలు, స్క్రీన్‌ప్లే: ఎ.దీపక్‌రాజ్, పాటలు: చంద్రబోస్, సంగీతం: తమన్, దర్శకత్వం: పి. కిశోర్ కుమార్(డాలీ).


Click it and Unblock the Notifications











