నాగచైతన్య, తమన్నాలది కన్ఫర్మ్ గా '100% లవ్'
నాగచైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రానికి '100% లవ్' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ....జల్సా, గజిని, మగధీర లాంటి సంచలన విజయాల తర్వాత గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న చిత్రమిది. దర్శకుడు చెప్పిన కథ విని గంటలోనే ఈ సినిమా నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. స్క్రిప్ట్‌పై వంద శాతం పట్టు వున్న దర్శకుడు సుకుమార్. తన గత చిత్రాల తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్, సుకుమార్ కలయికలో వచ్చిన గత చిత్రాల ఆడియోలు ఎలాంటి మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఆడియో కూడా వాటిని మించే విధంగా వుంటుంది. ఈ నెల మూడోవారంలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సమ్మర్‌లో ప్రతి ఒక్కరిని కూల్ చేసే లవ్ ఎంటర్‌టైనర్ ।100% లవ్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు అన్నారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి దర్సకుడు సుకుమార్. సమర్పణ: అల్లు అరవింద్, దర్శకత్వం: సుకుమార్, నిర్మాత: బన్నీ వాసు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఏడిద రాజా.


Click it and Unblock the Notifications











