నాగచైతన్య-తమన్నా ‘తడాఖా’ ఫస్ట్‌లుక్
హైదరాబాద్: నాగచైతన్య-సునీల్ కాంబినేషన్‌లో తమిళంలో విజయవంతమైన 'వెట్టై' చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పి. కిశోర్‌కుమార్(డాలి) దర్శకుడు. నాగ చైతన్య సరసన తమన్నా, సునీల్ సరసన ఆండ్రియా కథానాయికలుగా నటిస్తున్నారు. తెలుగులో 'తడాఖా' అనే టైటిల్ ఖరారు చేసారు. ప్రస్తుతం నిరవధికంగా చిత్రీకరణ జరుగుతోంది.
నాగ చైతన్య-తమన్నా కలిసి ఉన్న ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. గతంలో పలు చిత్రాల్లో వానపాటల్లో సెక్సీగా అందాలు ఆరబోసిన తమన్నా 'తడాఖా' సినిమాలో కూడా వాన పాటలో నటించబోతోంది. తమిళంలో లింగుస్వామి దర్శకత్వంలో 'వెట్టై' చిత్రం రూపొందగా, దానికి రీమేక్‌గా 'తడాఖా' చిత్రం డాలి దర్శకత్వంలో రూపొందుతోంది.
ఈ చిత్రంలో నాగచైతన్య, సునీల్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా గతంలో రచ్చ, ఆవారా చిత్రంలో వానపాటల్లో నటించి తన అందచందాలతో ప్రేక్షకులకు మంచి కిక్కెక్కించింది. తాజాగా తడాఖా చిత్రంలో కూడా తమన్నా అదే రేంజిలో రెచ్చిపోతుండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని దర్శకనిర్మాతలు నమ్ముతున్నారు. త్వరలో ఈచిత్రం విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
ఇక సినిమా కాన్సెప్టులోకి వెళితే ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో నాగచైతన్య అల్లరి తమ్ముడిగా, సునీల్ పిరికి పోలీస్ గా కనిపించనున్నారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అశుతోష్ రాణా, నాగినీడు, ఆహుతిప్రసాద్, జయప్రకాష్‌రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మూలకథ: లింగుస్వామి, మాటలు, స్క్రీన్‌ప్లే: ఎ.దీపక్‌రాజ్, పాటలు: చంద్రబోస్, సంగీతం: తమన్, దర్శకత్వం: పి. కిశోర్ కుమార్(డాలీ).


Click it and Unblock the Notifications











