ఇద్దరు హీరోల ‘తడాఖా’(ప్రివ్యూ)
హైదరాబాద్: నాగచైతన్య-సునీల్ కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ 'తడాఖా' చిత్రం ఈ రోజు(శుక్రవారం)విడుదల అవుతోంది. తమిళంలో విజయవంతమైన 'వెట్టై' చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెలుగులో 'తడాఖా' టైటిల్ తో రీమేక్ చేసి,విడుదల చేస్తున్నారు. కొంచెం ఇష్టం..కొంచెం కష్టం దర్శకుడు పి. కిశోర్‌కుమార్(డాలి) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
అన్న పిరికిగా విలిన్స్ ని ఎదుర్కోలేక తన పోలీస్ జాబ్ లో సతమతమవుతూంటే..తమ్ముడు చెలరేగిపోయి విలన్స్ కు సవాల్ విసిరి,అన్నకు అంజగా నిలుస్తాడనే కాన్సెప్టు తో వినోదాత్మకంగా రూపొందింది. నాగచైతన్య అల్లరి తమ్ముడిగా, సునీల్ పిరికి పోలీస్ గా కనిపించనున్నారు.
ఇక ఈ చిత్రం లోని పాటలు ఇప్పటికే విడుదలై మంచి సక్సెస్ అయ్యాయి. గతంలో పలు చిత్రాల్లో వానపాటల్లో సెక్సీగా అందాలు ఆరబోసిన తమన్నా 'తడాఖా' సినిమాలో కూడా వాన పాటలో చిందేస్తోంది.

ఈ చిత్రం గురించి నాగచైతన్య మాట్లాడుతూ...."ఇది పూర్తి స్థాయి యాక్షన్ సినిమా కాదు. భావోద్వేగాలున్న సినిమా. ఇద్దరు సోదరుల మధ్య ఉన్న బాంధవ్యాన్ని గురించి చెప్తుంది. తమిళంలో 'వేట్టై' చూడగానే నచ్చింది. సురేష్‌గారు వెంటనే ప్రారంభించారు. తెలుగుకు తగ్గట్టు చాలా మార్పులు చేశారు. సునీల్ తొలి సగంలో వినోదాన్ని పండిస్తూనే మలి సగంలో చాలా ఎమోషనల్ పాత్రచేశారు. నాకు అన్నయ్యగా నటించారు. చాలా ఇన్‌స్పైరింగ్ పర్సన్. నిజజీవితంలోనూ నాకు అన్నలాంటి వ్యక్తి. తమిళంలో సునీల్ పాత్రను మాధవన్ చేశారు. మాధవన్ లవ్‌స్టోరీలు, థ్రిల్లర్, హారర్, యాక్షన్ సినిమాలను చేశారు. ఆయనంటే నాకు పర్సనల్‌గా ఇష్టం." అన్నారు.
బ్యానర్ :సాయి గణేశ్ ప్రొడక్షన్స్
నటీనటులు : నాగచైతన్య, సునీల్ , తమన్నా, ఆండ్రియా, అశుతోష్ రాణా, నాగబాబు, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రఘుబాబు, రమాప్రభ, జయప్రకాష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు
కథ:లింగుస్వామి,
మాటలు:వేమారెడ్డి,
స్క్రీన్‌ప్లే:దీపక్‌రాజ్,
సంగీతం:తమన్,
కెమెరా:ఆర్డర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతంరాజు,
పాటలు:రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల,
నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు,
మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కిషోర్ పార్థాసాని (డాలి).


Click it and Unblock the Notifications











