అదంతా అబద్దం: హీరోయిన్ రకుల్ మ్యాటర్లో ట్విట్టర్లో నాగ చైతన్య క్లారిటీ!
నాగ చైతన్య సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే వ్యక్తి. తన సినిమాలు, తన పనులేవో చేసుకుంటూ చాలా లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తుంటారు. ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లోట్విట్స్ కూడా చాలా అరుదుగా చేస్తుంటారు. ఏవైనా రూమర్లు వచ్చినా పెద్ద గా పట్టించుకోరు. అయితే తాజాగా మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త విషయంలో ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. అది నిజం కాదంటూ క్లారిటీ ఇచ్చారు.

రకుల్ మ్యాటర్ కావడంతో
నాగచైతన్య, రకుల్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రాబోతోందని, కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సౌజన్య ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారని ఒక వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై వెంటనే చైతూ రియాక్ట్ అయ్యారు.

అదంతా అబద్దం
నాగచైతన్య ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘నా తర్వాత సినిమా గురించి ఓ వార్త ప్రచారంలో ఉంది. అందులో నిజం లేదు. దీన్ని ఎవరూ నమ్మవద్దని తెలిపారు.

నేను చేస్తున్న సినిమాలు ఇవే
ప్రస్తుతం 'సవ్యసాచి'తో పాటు మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను. ఈ రెండు సినిమాలు తెరకెక్కుతున్న తీరు ఎగ్జైటింగ్‌గా ఉంది. మంచి కంటెంటుతో తెరకెక్కుతున్న సినిమాలు ఇవి అని నాగ చైతన్య తెలిపారు.

త్వరలో వెల్లడిస్తాను
తన తదుపరి ప్రాజెక్టు గురించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను, ప్రస్తుతం నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదే అంటూ వస్తున్న వార్తలు అస్సలు నమ్మవద్దు, అందులో ఏ మాత్రం నిజం లేదు అని నాగ చైతన్య తెలిపారు.


Click it and Unblock the Notifications











