'రగడ' వీరూపోట్ల తర్వాతి ఫిల్మ్ ఆ యంగ్ హీరోతో...
నాగార్జునతో రగడ చిత్రం, మంచు మనోజ్ తో బిందాస్ చిత్రం రూపొందించిన వీరుపోట్ల తన తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సారి ఈ యువ దర్శకుడుతో నాగార్జున కుమారుడు నాగచైతన్య చేయనున్నాడు. యాక్షన్ తో కూడిన రొమాంటిక్ కామిడీగా రూపొందే ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. రగడ చిత్రం నిర్మించిన కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది. రగడ చిత్రంలో తనను స్టైలిష్ గా చూపించటంతో నాగార్జున మెచ్చుకుని ప్రత్యేకంగా వీరు పోట్లను పిలిచి ఈ చిత్రం అప్పచెప్పినట్లు తెలుస్తోంది.
ఇక నాగ చైతన్య వరసగా దడ,బెజవాడ చిత్రాలతో ఫెయిల్యూర్ లో ఉన్నారు. ప్రస్తుతం దేవకట్టాతో ఆటోనగర్ సూర్య చిత్రం చేస్తున్నారు. అలాగే త్వరలో రాధామోహన్ దర్శకత్వంలో గౌరవం చిత్రం చేయనున్నారు. వీరుపోట్ల మొదట పవన్ కల్యాణ్ తో చిత్రం అనుకున్నారు కానీ డేట్స్ బాగా లేటవటంతో నాగచైతన్యతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించిన అఫీషియల్ ప్రకటన రానుంది.


Click it and Unblock the Notifications











