నాగ చైతన్య లైనప్ మామూలుగా లేదు.. వరుసగా 4 సినిమాలు
అక్కినేని హీరోల్లో నాగ చైతన్య ఒక్కడే గ్యాప్ లేకుండా ఎక్కువ సినిమాలను చేస్తున్నాడు. సింపుల్ గా ఉండే ఫ్యామిలీ కథలకు అలాగే ఎమోషనల్ రొమాంటిక్ కథలకు చైతూ కరెక్ట్ గా సెట్టవుతాడాని కొంతమంది దర్శకులు మరొకరి దగ్గరకు వెళ్లడం లేదు. మొదటి ఆప్షన్ గా నాగచైతన్యను చాలా మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక చైతూ కూడా తొందరపడకుండా కేవలం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు.
ముఖ్యంగా మజిలీ సినిమా తరువాత ఈ అక్కినేని హీరో కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీలుకుందనే చెప్పాలి. వెంకీ మామా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి మంచి ఒపెనింగ్స్ అందుకుంది. ఇక నెక్స్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానున్న లవ్ స్టోరీపై అంచనాలు భారిగానే ఉన్నాయి. సాయి పల్లవి నటిస్తుండడంతో చైతూ స్ట్రాంగ్ హిట్ అందుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది.

ఇక మనం డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో కూడా 'థాంక్ యూ' అనే సినిమాను లైన్ లో పెట్టిన నాగ చైతన్య వెంకీ అట్లూరితో ఒక రొమాంటిక్ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇక మరోవైపు పరశురామ్ తో ఆల్రెడీ ఒక సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ విధంగా నాగ చైతన్య వరుసగా నాలుగు కథలను అయితే రెడీగా ఉంచుకున్నాడు. అలాగే మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేసే ఛాన్స్ ఉన్నట్లు ఒక రూమర్ అయితే వచ్చింది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











