నాగచైతన్య-వీరు పొట్ల సినిమా ఖరారు
హైదరాబాద్: నాగార్జునతో రగడ, మంచు మనోజ్ తో బిందాస్ చిత్రాలు రూపొందించిన వీరుపోట్ల తన తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సారి ఈ యువ దర్శకుడు నాగచైతన్యతో సినిమా చేయనున్నాడు. యాక్షన్ తో కూడిన రొమాంటిక్ కామిడీ అంశాలతో రూపొందే ఈ చిత్రం అక్టోబర్లో ప్రారంభం కానుంది. రగడ చిత్రం నిర్మించిన కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది. రగడ చిత్రంలో తనను స్టైలిష్ గా చూపించటంతో నాగార్జున మెచ్చుకుని ప్రత్యేకంగా వీరు పోట్లను పిలిచి ఈ చిత్రం అప్పచెప్పినట్లు తెలుస్తోంది.
ఇక నాగచైతన్య వరసగా దడ, బెజవాడ చిత్రాలతో ఫెయిల్యూర్ లో ఉన్నారు. ప్రస్తుతం దేవకట్టాతో ఆటోనగర్ సూర్య చిత్రం చేస్తున్నారు. అలాగే త్వరలో రాధామోహన్ దర్శకత్వంలో గౌరవం చిత్రం చేయనున్నారు. వీరుపోట్ల మొదట పవన్ కల్యాణ్ తో చిత్రం అనుకున్నారు కానీ డేట్స్ బాగా లేటవటంతో నాగచైతన్యతో చేస్తున్నకమిట్ అయినట్లు తెలుస్తోంది.
వీరూ పోట్ల కామెడీని బాగా చూపించగలడని తను తీసిన 'బిందాస్' చిత్రంతో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య ఒక కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఎంచుకోవడం ఒక ట్రిక్ అనే చెప్పుకోవాలి. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రం కోసం శృతి హాసన్ ను హీరోయిన్‌గా తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











