రిలీజ్ అయిన రెండో రోజే ‘వెంకీ మామ’కు భారీ షాక్.. ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్ పెట్టేశారు.!

By Manoj Kumar P

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ - అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'వెంకీ మామ'. కేఎస్ రవీంద్ర (బాబీ) తెరకెక్కించిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఇందులో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్ నటించగా, నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా కనిపించింది. థమన్ సంగీతం అందించాడు.

రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన వెంకీ, చైతూ కలిసి నటించిన సినిమా కావడంతో రెండు కుటుంబాల అభిమానులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో 'వెంకీ మామ'కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు ఇదే

ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు ఇదే

శుక్రవారం ‘వెంకీ మామ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర యూనిట్ మొదటి నుంచీ చెబుతున్నట్లు ఇందులో వెంకటేష్ పాత్ర నాగ చైతన్య కంటే కొంత తక్కువగా ఉంది. అయినప్పటికీ ఇద్దరి పాత్రలకూ ప్రాధాన్యత కనిపించింది. కామెడీతో నవ్వించడంతో పాటు సెంటిమెంట్‌తో ఏడిపించారు. మొత్తంగా ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. రోజులు గడిచే కొద్దీ ఎలా ఉంటుందో చూడాలి.

 టాక్‌తో సంబంధం లేని కలెక్షన్లు

టాక్‌తో సంబంధం లేని కలెక్షన్లు

ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం దుమ్ము దులిపేస్తున్నాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ‘వెంకీ మామ' రూ 6.76 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. దీనికి కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా వసూళ్లు కలుపుకుంటే రూ. 7.40 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అంటే ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోల కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది.

‘వెంకీ మామ'కు భారీ షాక్

‘వెంకీ మామ'కు భారీ షాక్

రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు స్టార్లు నటించిన సినిమా కావడంతో ‘వెంకీ మామ'పై మొదటి నుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీంతో ఈ సినిమాను చూడాలని చాలా మంది అనుకున్నారు. ఇదే తమకు ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ కూడా భావించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఆన్‌లైన్‌లో లీక్ చేసేశారు. అంతేకాదు, డౌన్‌లోడ్ లింక్ సైతం పెట్టేశారు.

ఇది వాళ్ల పనే.. గతంలోనూ అంతే

ఇది వాళ్ల పనే.. గతంలోనూ అంతే

కొన్నేళ్లుగా ఏదైనా సినిమా రిలీజ్ అయిన గంటల్లోనే పైరసీ రూపంలో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయిపోతుంది. దీనికి కారణం సినిమా ఇండస్ట్రీని భూతంలా పట్టి పీడిస్తున్న తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌. ఈ వెబ్‌సైట్ వల్ల దక్షిణాదిలోని చిత్ర పరిశ్రమలకు ఎంతో నష్టం వాటిల్లుతోంది. గతంలోనూ ఎన్నో సినిమాలను ఇలా 24 గంటలు కూడా గడవక ముందే ఆన్‌లైన్‌లో పెట్టేశారు.

తమిళ రాకర్స్ చేసే పని ఇదే

తమిళ రాకర్స్ చేసే పని ఇదే

దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీలకు తమిళ రాకర్స్ వరుస షాక్‌లు ఇస్తూనే ఉంది. సినిమా విడుదల అయిన కొన్ని గంటల్లోనే పైరసీ చేసి ఆన్‌లైన్ పెడుతూ ఫిల్మ్ మేకర్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ సైట్‌పై ప్రభుత్వాలు ఎన్ని సార్లు నిషేదం విధించినా ఫలితం ఉండడం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త అడ్రెస్‌లు సృష్టించి నెటిజన్లకు దగ్గరవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X