నాగచైతన్యకూ ఆ పిచ్చి పట్టింది
నాగచైతన్యకు ఇప్పుడు యాక్షన్ హీరో అనిపిచుకోవాలనే కోరిక బాగా పెరిగిపోతున్నట్లుంది. అందుకు తగినట్లుగా అతను సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించాలని నాగచైతన్య వువ్విళ్లూరుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటినుంచే జిమ్‌లో కండలు పెంచే పనిలో ఉంటున్నాడని తెలుస్తోంది. నాగచైతన్య నటించబోయే 'ఆటోనగర్ సూర్య"కోసం ఇలా కనపించాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఏంమాయచేశావె, 100%లవ్ చిత్రాలతో క్లాస్ ఇమేజ్‌ను సొంతంచేసుకున్న నవ యువసామ్రాట్ నాగచైతన్య ఇప్పుడు 'బెజవాడ", 'ఆటోనగర్ సూర్య" చిత్రాలలో మాస్ కి దగ్గరవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక నాగచైతన్య నటిస్తున్న ఈ రెండు సినిమాలు విజయవాడ నేపథ్యం కావడం విశేషం. ''దుర్మార్గులను అంతం చేయాడానికి ఒక్కోసారి దుర్మార్గుడిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది.
తను పుట్టి పెరిగిన 'బెజవాడ' జోలికొస్తే ఎంతటివారినైనా ఎదిరించేందుకు సిద్ధమైన యువకుడి కథ 'బెజవాడ'. ఆ యువకుడుగా నాగచైతన్య కనిపిస్తారు.అలాగే ఎవరైనా సరే పుడుతూనే కత్తి పట్టుకొని పగతో రగిలిపోరు. పరిస్థితులే వాళ్లలో కక్షల్నీ, కార్పణ్యాల్నీ పెంచుతాయి. మా కథలోని యువకుడు ఏ కారణాలతో రౌడీగా మారాల్సి వచ్చింది. అతని లక్ష్యం ఏమిటి అన్నది తెర మీదే చూడాలి నాగచైతన్య నటన తప్పకుండా మాస్ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు దర్శకుడు వివేక్‌కృష్ణ. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బెజవాడ'. నాగచైతన్య, అమలాపాల్ జంటగా నటిస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు నిర్మాతలు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఛేజింగ్ దృశ్యాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 12 నుంచి స్విట్జర్లాండ్‌లో పాటలు చిత్రిస్తారు. దీపావళికి సినిమా విడుదలవుతుంది.


Click it and Unblock the Notifications











