ఆ మాటంటే, ముఖం మీద పంచ్ ఇస్తా... చైతూకి సమంత వార్నింగ్.. ఏం జరిగిందంటే!

అక్కినేని నట వారసుడు నాగచైతన్య, సమంత అక్కినేని తమ పెళ్లి తర్వాత నటిస్తున్న చిత్రం మజిలి. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ చిత్రం సిద్ధమవుతున్నది. అప్పుడే ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. ఇటీవల ఈ ప్రమోషన్ కార్యక్రమంలో చైతూ, సమంత జంటగా మాట్లాడుతూ.. చిలిపి చిలిపిగా, సరదా సరదాగా తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. సమంత, చైతూ మధ్య జరిగిన సంభాషణ ఏమిటంటే..

 పెళ్లి తర్వాత బోరింగ్‌గానే

పెళ్లి తర్వాత బోరింగ్‌గానే

పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉందనే ప్రశ్నకు నాగచైతన్య సమాధానం ఇస్తూ.. చాలా బోరింగ్ ఉందని చెప్పగానే.. సమంత మధ్యలో అలాంటిదేమీ లేదన్నట్టు ఫోజు పెట్టింది. పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్నాం. కానీ మళ్లీ ప్రేమలో పడినట్టు నటిస్తే నమ్ముతారా? అని చైతన్య అన్నారు.

వివాహం చాలా మార్పులు జరిగాయి

వివాహం చాలా మార్పులు జరిగాయి

పెళ్లి తర్వాత ఎలాంటి మార్పులను గుర్తించారా అనే ప్రశ్నకు చైతన్య జవాబిస్తూ.. రాత్రి ఎప్పుడు వచ్చాం.. ఉదయం బయటకు వెళ్తున్నాం అనే తెలియడం లేదు. సమంత ఇన్స్‌టాగ్రామ్ పిక్చర్స్ చూస్తే నాకు భరించలేకుంటా ఉన్నాయి అని చైతన్య చెప్పగా... నా ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో అన్నీ పార్టీలకు సంబంధించిన ఫొటోలే అని సమంత నవ్వుతూ పలు విషయాలు వెల్లడించింది.

సక్సెస్, ఫెయిల్యూర్స్ చూశాం

సక్సెస్, ఫెయిల్యూర్స్ చూశాం

పెళ్లి తర్వాత కెరీర్, ఫ్యామిలీ పరంగా చాలా మార్పులు చోటుచేసుకొన్నాయి. సక్సెస్, ఫెయిల్యూర్ చూశాం అని చైతన్య చెప్పారు. చైతన్య‌ గురించి నా కంటే ఎవరికీ తెలియదు. నా గురించి చైతన్యకు తెలిసినంతగా మరొకరి తెలియదు. అలా మా ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది అని సమంత చెప్పింది.

నాపై సమంత‌కు చాలా పొసెసివ్

నాపై సమంత‌కు చాలా పొసెసివ్

నాగచైతన్యపై సమంతకు చెప్పలేనంత పొసెసివ్ నెస్‌ ఉంటుందా అనే ప్రశ్నకు చైతూ సమాధానం ఇస్తూ.. ఆ విషయాన్ని నేను ఒప్పుకొంటాను అని అన్నారు. అయితే ఈ మధ్య కాలంలో పొసెసివ్‌నెస్‌ను చాలా తగ్గించుకొన్నాను. రిలేషన్స్ విషయంలో చాలా ఇంప్రూవ్ అయ్యాను. చైతన్యను అతిగా ప్రేమించడం తగ్గించుకొన్నాను అని సమంత చెప్పింది.

అమ్మాయిలు, కార్లంటే ఇష్టం

అమ్మాయిలు, కార్లంటే ఇష్టం

జీవితంలో ఎలాంటి విషయాలంటే మీకు ఇష్టం, మక్కువ అంటే.. కార్లు, అమ్మాయిలు అంటే చెప్పలేనంత ఇష్టం అని చైతన్య సమాధానం ఇచ్చారు. దానికి వెంటనే సమంత స్పందిస్తూ.. ఆ మాట అంటే ముఖంపై ఓ పంచ్ ఇస్తాను అని సమంత వార్నింగ్ ఇచ్చారు.

 పెళ్లి తర్వాత ఏడాదే హ్యాపీ.. ఆ తర్వాత బోరింగ్

పెళ్లి తర్వాత ఏడాదే హ్యాపీ.. ఆ తర్వాత బోరింగ్

ఎవరికైన పెళ్లి అయిన తర్వాత ఏడాది వరకే హ్యాపీ. ఆ తర్వాత అంతా బోరింగే అని చైతన్య చెప్పారు. అందుకు సమంత బదులిస్తూ.. నేను ఎంత బోరింగ్, ఎలాంటి మనిషిని పెళ్లి చేసుకొన్నానో మీకు సరిగానే అర్దమవుతుందనుకొంటా అని సమంత చిలిపిగా జవాబిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X