»   » నాగార్జున సూపర్ హిట్ సాంగ్ పై కన్నేసిన నాగ చైతన్య!

నాగార్జున సూపర్ హిట్ సాంగ్ పై కన్నేసిన నాగ చైతన్య!

Subscribe to Filmibeat Telugu

భిన్నమైన కథల్ని ఎంచుకుంటూ నాగ చైతన్య ముందుకు పోతున్నాడు. నాగచైతన్య తాజగా నటిస్తున్న చిత్రం సవ్యసాచి. చందు ముండేటి ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విభిన్న కథలతో ఆకట్టుకునే చందు ముండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

లేటెస్ట్ న్యూస్ ప్రకారం నాగచైతన్య తన తండ్రి నాగార్జున సూపర్ హిట్ సాంగ్ పై మనసు పడ్డట్లు తెలుస్తోంది. 'నిన్ను రోడ్డుమీద చూసినట్టు లగ్గాయితు' అనే పాట వినేవుంటారు. నాగార్జున సూపర్ హిట్ చిత్రం అల్లరి అల్లుడు చిత్రంలోనిది ఈ సాంగ్. అప్పట్లో ఈ సాంగ్ చాలా పాపులర్ అయింది. ఈ పాటని సవ్యసాచి చిత్రంలో రీమిక్స్ చేయాలని నాగ చైతన్య భావిస్తున్నాడట.

Naga Chaitanya will going to remix his fathers song

ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు మాధవన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగ చైతన్య నటించిన చివరి చిత్రం యుద్ధం శరణం నిరాశ పరిచింది. దీనితో చైతు ఈ చిత్రంపై ఆశలు పెట్టుకుని ఉన్నాడు.

English summary
Naga Chaitanya will going to remix his father's song. Chandoo Mondeti is directing the Naga Chaitanya's Savyasachi movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X