twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రైమ్ కామెడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య

    By Srikanya
    |

    హైదరాబాద్ : తడాఖా చిత్రం విజయంతో జోరు మీద ఉన్న నాగచైతన్య వరస సినిమాలు కమిటవుతున్నారు. తాజాగా 'స్వామి రా.. రా...' వంటి చిన్న చిత్రంతో హిట్ కొట్టిన దర్శకుడు సుధీర్ వర్మ చిత్రం స్క్రిప్టు ఓకే చేసారు.రీసెంట్ గా అత్తారింటికి దారేది చిత్రం తో హిట్ కొట్టిన ఛత్రపతి బి.వియస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాసం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సుధీర్ వర్మ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడని చెప్తున్నారు.

    ఇక ఈ చిత్రం కూడా క్రైమ్ కామెడీ అని చెప్తున్నారు. అయితే పూర్తిగా ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయని,చైతన్య ఇప్పటిదాకా ఇలాంటి సబ్జెక్టు టచ్ లేదని అంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం గురించి వివరాలు అఫీషియల్ గా వెలవడనున్నాయి. సుధీర్ వర్మ తన తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో,ఎన్టీఆర్ తో చిత్రాలంటూ ప్రచారం జరిగింది. అయితే నాగచైతన్య హీరోగా నెక్ట్స్ చిత్రం మొదలుకానుంది. ఇక నాగచైతన్య కొత్త చిత్రం ఈ మధ్యనే ప్రారంభం అయ్యింది. గుండె జారి గల్లంతైంది దర్శకుడుతో ఈ చిత్రం మొదలైంది.

    Naga Chaitanya with Crime Comedy

    మరో ప్రక్క హన్సిక హీరోయిన్ గా నాగచైతన్య వేరే చిత్రం ఓకే చేసారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసరెడ్డి డైరక్ట్ చేయనున్నారు.వరుణ్ మరియు తేజ శ్రీ శుభ శ్వేత ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తారు. ఆకుల శివ కథ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. సి.కళ్యాణ్ ఈ చిత్రం సమర్పిస్తారు. ఇక ఇన్ని రోజులుగా నాగచైతన్య,శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ చిత్రం హలో బ్రదర్ రీమేక్ అని వినపడింది. అయితే అది కాదు కొత్త కథ అని తెలుస్తోంది. నాగచైతన్య, శ్రీనివాసరెడ్డి కాంబినేషన్‌లో రూపొందే సినిమా 'హలోబ్రదర్' రీమేక్ కాదు. ఆకుల శివ తయారు చేసిన ఓ మాస్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు శ్రీనివాసరెడ్డి.

    మరో వైపు... నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో వైపు...ప్రముఖ నిర్మాత రామానాయుడు తన మనవడు నాగ చైతన్య (కూతురు కొడుకు)హీరోగా సినిమా చేయబోతున్నాడు. పంజాబీ హిట్ మూవీ 'సింగ్ వర్సెస్ కౌర్' చిత్రానికి రీమేక్ గా రూపొందబోయే ఈ చిత్రాన్ని తమ సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌పై నిర్మించబోతున్నారు.

    English summary
    Naga Chaitanya is all set to work with Sudheer Varma. Chaitanya was impressed with Sudheer's Script and has okeyed the project. The Film would be a crime comedy laced with entertaining elements.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X