twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Naga Chaitanya: మరదలుతో నాగ చైతన్య.. రెస్టారెంట్ లో వెంకటేష్ కూతురితో వీడియో వైరల్!

    |

    టాలీవుడ్​ గుడ్​ బాయ్​గా పేరు తెచ్చుకున్నాడు అక్కినేని నాగ చైతన్య. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున తర్వాత నట వారసుడిగా తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. సినీ ఇండస్ట్రీలో సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీ వంటి విషయాలకు దూరంగా ఉంటాడు. సినిమాలు, ప్రమోషన్లు, కెరీర్​ అంటూ తన పని తాను చూసుకుంటుపోయే కామ్​ పర్సన్. ఇటీవల నాగ చైతన్య సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. దీంతో సినిమా ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు చైతూ. అయితే తాజాగా ఫ్యామిలీ హీరో వెంకటేష్ కూతురు అశ్రితతో కలిసి ఓ వీడియోలో పాల్గొన్నాడు చైతూ. ఆ వివరాల్లోకి వెళితే..

    ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు..

    ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు..

    టాలీవుడ్​ మన్మథుడు నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీకి నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు కావొస్తుంది. నాగచైతన్య 2009లో జోష్ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అక్కినేని కుటుంబం నుంచి హీరో వస్తుండటంతో సినీ అభిమానుల్లో, అక్కినేని ఫ్యాన్స్‌ నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా విడుదలైన తర్వాత అంచనాలన్నీ తారుమారయ్యాయి. తర్వాత గౌతమ్​ వాసుదేవ్​ మీనన్​ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో మంచి హిట్​ కొట్టాడు నాగ చైతన్య.

    మిల్కీ బ్యూటి తమన్నాతో..

    మిల్కీ బ్యూటి తమన్నాతో..

    ఏ మాయ చేశావే సినిమాలో ముద్దు సీన్లు, నటనతో యూత్​ను ఎక్కువగా అట్రాక్ట్ చేశాడు. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్​ఫేర్​ అవార్డు కూడా అందుకున్నాడు. అనంతరం క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్నాతో నాగ చైతన్య జోడి కట్టిన చిత్రం 100% లవ్. ఈ సినిమా కూడా బ్లాక్​ బస్టర్ హిట్​ అయింది. దీంతో చైతూ లవర్ బాయ్​గా ముద్ర వేసుకున్నాడు.

    కోలీవుడ్ డైరెక్టర్ తో..

    కోలీవుడ్ డైరెక్టర్ తో..

    ఇక ఇదిలా ఉంటే మనం వంటి హిట్​ ఇచ్చిన విక్రమ్ కె కుమార్​ దర్శకత్వంలో వచ్చిన థ్యాంక్యూ మూవీ సినీ ప్రియులను నిరాశపరిచింది. లాల్ సింగ్ చద్ధాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో సినిమా ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నాడు చైతూ. ఇందులో భాగంగానే కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమాలో నటిస్తున్నాడు నాగ చైతన్య.

    పోలీస్ ఆఫీసర్ గా..

    పోలీస్ ఆఫీసర్ గా..

    కస్డడీ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. నాగ చైతన్యకు ఇది తొలి స్ట్రయిట్ తమిళ సినిమా. నాగ చైతన్య 22వ సినిమాగా వస్తున్న కస్డడీ ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేశారు. చైతూ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ పోస్టర్ లో ప్రపంచంలో మార్పు రావాలంటే.. అది ముందుగా నీలో రావాలి అని కొటేషన్ కూడా ఇచ్చారు.

    వెంకటేష్ పెద్ద కూతురితో..

    వెంకటేష్ పెద్ద కూతురితో..

    ఇక నాగ చైతన్య సినిమా విషయాలు పక్కన పెడితే హైదరాబాద్ లో షోయు అనే పేరుతో జపనీస్ రెస్టారెంట్ రన్ చేస్తున్న విషయం తెలిసిందే. అథెంటిక్ జపనీస్ ఫుడ్ కాకుండా అక్కడి మెనూకి ఇక్కడి లోకల్ ఫ్లేవర్ అద్ది వంటకాలను అందిస్తున్నారు. తాజాగా ఈ రెస్టారెంట్ లో వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత, నాగ చైతన్య కలిసి ఓ వీడియో రూపొందించారు. షోయు రెస్టారెంట్ లో ఫుడ్ ఎలా ఉంటుంది వంటి తదితర అంశాలపై చర్చించారు.

    షోయి అంటే అర్థం ఏంటీ..

    షోయి అంటే అర్థం ఏంటీ..

    అయితే అశ్రిత ఇన్ఫినిటీ ప్లాటర్ యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తోంది. ఈ ఛానెల్ లో భాగంగా నాగ చైతన్య షోయు రెస్టారెంట్ లో వీడీయో రూపొందించారు. పూర్తిగా ఇంగ్లీష్ లో సాగే ఈ వీడియోలో షోయులో లభించే ఫ్యూజన్ జపనీస్ ఫుడ్ గురించి.. నాగ చైతన్య వివరించాడు. మా బావను మీట్ అవుదామంటూ వీడియోను ప్రారంభించింది అశ్రిత. షోయు అంటే అర్థం ఏంటి అని అశ్రిత అడిగితే.. షోయి అంటే సోయా సాస్ అని సమాధానం ఇచ్చాడు చైతూ.

    ప్యాకేజింగ్ కూడా ప్రత్యేకమే..

    ప్యాకేజింగ్ కూడా ప్రత్యేకమే..

    ఈ రెస్టారెంట్ పెట్టడానికి స్ఫూర్తి ఏంటీ అని అడగ్గా.. అలాంటిదేమి పెద్దగా లేదు. కానీ నాకు జపనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కడికి వెళ్లిన జపనీస్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అని చూస్తాను. ఇక్కడ కూడా అలాంటి ఒక రెస్టారెంట్ ఉండాలని పెట్టాను అని చైతూ తెలిపాడు. కేవలం ఫుడ్ మాత్రమే కాకుండా తమ ప్యాకేజింగ్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఈ వీడియోలో నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్య తల్లి లక్ష్మీ.. వెంకటేష్ కి సోదరి అని తెలిసిన విషయమే.

    English summary
    Naga Chaitanya Explains About Shoyu Restaurant To Venkatesh Daughter Ashritha In Youtube Channel Video.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X