నాగ చైతన్య, మాధవన్ మధ్య పోటాపోటిగా... అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా...
ప్రేమమ్ వంటి సూపర్ సక్సెస్ అనంతరం అక్కినేని నాగచైతన్య, చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం సవ్యసాచి. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూ యార్క్ లో జరుగుతోంది. త్వరలో చిత్ర యూనిట్ ఇండియా తిరిగివచ్చి మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి విడుదల తేదిని ప్రకటించబోతున్నారు.
సవ్యసాచి చిత్ర దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా హై టెక్నికల్ వేల్యూస్‌తో తెరకెక్కించబోతున్నారు. సినిమా విడుదల తరువాత ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే విధంగా సీన్స్ ఉండబోతున్నాయని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

హీరో నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. విలన్ పాత్రలో మాధవాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, మాధవాన్ మధ్య వచ్చే సన్నివేశాలు పోటా పోటిగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. నాగ చైతన్య అక్కగా భూమిక నటిస్తోంది.


Click it and Unblock the Notifications











