twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆకట్టుకొన్న KKK టైటిల్.. కర్త, కర్మ, క్రియ ఫస్ట్‌లుక్

    By Rajababu
    |

    ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో రూపొందిస్తున్న సినిమా టైటిల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రొడక్షన్ నెం.9గా నిర్మించనున్న తెలుగు స్ట్రయిట్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు కర్త కర్మ క్రియ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. "వీకెండ్ లవ్" ఫేం నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా వసంత్ సమీర్, సెహర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.

    ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి మాట్లాడుతూ.. "మా సంస్థ నుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్నీ సినిమాలకంటే వైవిధ్యంగా ఈ సినిమా ఉండబోతోంది. నాగు గవర కథ ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ కు గురి చేసేలా ఉంటుంది. ఈ చిత్రం ప్రీలుక్ పోస్టర్ ను "#KKK" అని విడుదల చేసినప్పట్నుంచి టైటిల్ ఏంటో అనే అటెన్షన్ అందరిలో మొదలైంది. "కర్త కర్మ క్రియ" అనే వైవిధ్యమైన టైటిల్ ను ఈ సినిమాకు ఎంచుకుని ఈ రోజు రివీల్ చెస్తున్నాము. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలొనె మోషన్ పొస్టర్, టీజర్ లను విడుదల చెస్తామన్నారు.

    Naga Gavaras Karta Karma Kriya title First look released

    దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. యదార్ద సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న కల్పిత కథ ఇది. సమాజంలో జరిగే సంఘటనలకు సంబంధించిన ఎలిమెంట్స్‌తో కర్త కర్మ క్రియ ను రూపొందిస్తున్నాము. రియలిస్టిక్ యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది. మంచి టెక్నికల్ టీమ్ మా సినిమాకు సెట్ కావటంతో పాటు, నిర్మాతల సపోర్ట్ మా సినిమాకు ప్రధాన బలం.

    పక్కా ప్లానింగ్ తో అనుకున్న సమయానికి ఈ సినిమాను కంప్లీట్ చెశాము. హీరొ హీరొయిన్లు కొత్త వారైనా అనుభవం ఉన్న నటీనటులుగా తమ ప్రతిభను చాటుకొన్నారు. టెక్నికల్‌గా అంతే ఉత్తమంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తీశాం. కర్త కర్మ క్రియ యాప్ట్ టైటిల్. టైటిల్‌లోనే ఈ సినిమా అసలైన కంటెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ టైటిల్ ,కంటెంట్ నచ్చుతుందని చిత్ర యూనిట్‌, అందరికీ పేరొస్తుందన్న నమ్మకముందన్నారు.

    వసంత్ సమీర్, సెహర్, రవివర్మ, శ్రీహర్ష, జబర్దస్త్ రాంప్రసాద్, కాదంబరి కిరణ్, నీలిమ, జయప్రకాష్, శ్రీసుధ, కాశీవిశ్వనాధ్, సంధ్య పెద్దాడ, రమణారెడ్డి, కృష్ణతేజ, మహేందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దుర్గాకిషోర్ బోయిదాపు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: అనీ , కాస్ట్యూమ్స్: టి.ఎస్.రావు, కాస్ట్యూమ్ డిజైనర్: మంజుల భూపతి, నిర్మాణ నిర్వహణ: వినాయకరావు, నిర్మాత: చదలవాడ పద్మావతి, రచన-దర్శకత్వం: నాగు గవర.

    English summary
    Weekend Love movie director Naga Gavara's latest movie is Karta Karma Kriya. This movie titles first look announce on September 6th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X