Naga Shaurya Marriage: ఘనంగా నాగ శౌర్య వివాహం, వీడియో వైరల్.. వధువు గురించి ఈ విషయాలు తెలుసా?
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ శౌర్య. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. ఇటీవల కృష్ణవ్రింద విహారి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాగ శౌర్య ఇటీవల పెళ్లి గురించి అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి పనులతో బిజీగా ఉన్న నాగ శౌర్య సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొన్నాడు. డీహైడ్రేట్ కారణంగా ఆస్పత్రిపాలైన నాగ శౌర్య డైరెక్ట్ పెళ్లి పీటలు ఎక్కేసాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషతో నాగ శౌర్య పెళ్లి ఘనంగా జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

బెంగళూరు వేదికగా..
యంగ్ హీరో నాగ శౌర్య ఇవాళ అంటే నవంబర్ 20 ఆదివారం పెళ్లి పీటలు ఎక్కి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరయర్ డిజైనర్ అయిన అనూష మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే వివాహానికి సంబంధించిన పనులు అతిథుల కోసం ఘనంగా ఏర్పాటు జరిగాయి. వధువు, వరుడుల ఇరు కుటుంబ సభ్యులు నాగశౌర్య-అనూష వివాహం బ్రహ్మాండంగా నిర్వహించారు. వీరి వివాహమహోత్సవం బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఘనంగా జరిగింది.

నెటిజన్ల శుభాకాంక్షలు..
పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ సెలబ్రేషన్స్ కూడా జోరుగా నిర్వహించారు. హల్దీ ఫంక్షన్ తర్వాత కాక్ టెయిల్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, సన్నిహితలు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ హల్దీ వేడుకల్లో భాగంగా కాబోయే భార్య అనూషకు నాగ శౌర్య బంగారు ఉంగరాన్ని తొడిగాడు. కుటుంబసభ్యులు, వధూవరుల మిత్రుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నాగ శౌర్య-అనూష పెళ్లి వీడియోకు జోడి బాగుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అలాగే అభినందనలు, ఆల్ ది బెస్ట్ అని తెలుపుతున్నారు.

బెంగళూరులో పాపులర్..
ఇటీవలే తన పెళ్లి విషయాన్ని హీరో నాగ శౌర్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. బెంగళూరుకు చెందిన అనూషను వివాహం చేసుకోబోతున్నట్లు పేర్కొన్నాడు. బెంగళూరులో అనూష ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. సొంతంగా ఓ ఇంటీరియర్ డిజైన్ సంస్థను స్థాపించిన అనూష ఆమె కుటుంబ వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె ప్రతిభకు ఎన్నో అవార్డులు వచ్చాయి. బెంగళూరులో అనూషతో నాగ శౌర్యకు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి.. ఇప్పుడు పెళ్లిపీటల దాకా వచ్చింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో బెంగళూరు వేదికగా వీరి వివాహం జరిగింది.
సొంత బ్యానర్ లో..
ఇక నాగ శౌర్య ఇటీవల కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకోగా హిట్స్, ప్లాప్స్ అంటూ చూసుకోకుండా సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు నాగ శౌర్య. ప్రస్తుతం సొంత బ్యానర్ లోనే సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు. ఇటీవల ఐదారు రోజుల క్రితం షూటింగ్ స్పాట్ లో నాగ శౌర్య స్పృహ తప్పిపోవడంతో కుటుంబసభ్యులు ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. డిహైడ్రేషన్ వల్ల కళ్లు తిరిగాయని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నేరుగా నాగ శౌర్య పెళ్లి పీటలు ఎక్కినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











