twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాక్:నాగ శౌర్యకు ప్రమాదం.. కాలు ఫ్యాక్చర్

    |

    Recommended Video

    షూటింగ్‌లో అపశ్రుతి.. హీరో నాగశౌర్య కాలు ఫ్యాక్చర్ !

    ఈ మధ్యకాలంలో షూటింగుల్లో గాయపడటం అనే వార్తలు బాగా వింటున్నాం. దీనికి కారణం సినిమాల్లో రియాలిటీకి పెద్ద పీట వేస్తూ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడమే అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో అలా గాయపడిన హీరోలు లాంగ్ టర్మ్ ఆ గాయం నుంచి కోలుకోలేని పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు. ఇక విషయంలోకి వస్తే.. యంగ్ హీరో నాగ శౌర్య తన కొత్త సినిమా షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యాడని తెలిసింది.

    సొంత బ్యానర్‌లో సినిమా

    సొంత బ్యానర్‌లో సినిమా

    నాగ శౌర్యకు స్టార్ హీరో స్టేటస్ లేకపోయినా కూడా సినిమా రంగంలో రాణించాలనే తపన ఉన్న వ్యక్తి. అందుకే హీరోగా చేస్తూనే ఐరా క్రియేషన్స్ పేరుతో ఓ సొంత బ్యానర్ కూడా ప్రారంభించాడు. ఈ మేరకు ఈ బ్యానర్ పై మూడో ప్రాజెక్టుగా స్వయంగా తానే హీరోగా నటిస్తూ సినిమా మొదలు పెట్టేశాడు. రమణ తేజ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

    గత పది రోజులుగా వైజాగ్‌లో

    గత పది రోజులుగా వైజాగ్‌లో

    ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ గత పది రోజులుగా వైజాగ్‌ లోని అందమైన లొకేషన్స్ లో జరుగుతోంది. ఈ సెట్స్ పై హీరో నాగ శౌర్య, హీరోయిన్ మెహ్రీన్ చురుకుగా కదులుతున్నారు. అయితే నిన్న (జూన్ 14) షూటింగ్ లో భాగంగా ఓ సీన్ తెరకెక్కిస్తుండగా నాగ శౌర్యకు గాయాలయ్యాయని సమాచారం. కాలికి బలమైన ఫ్రాక్చర్ కావడంతో షూటింగ్ క్యాన్సిల్ చేశారని అంటున్నారు.

    నెల రోజులు బెడ్‌కే అంకితం కావాల్సిందే

    నెల రోజులు బెడ్‌కే అంకితం కావాల్సిందే

    నాగ శౌర్య కాలికి తగిలిన బలమైన గాయాన్ని పరిశీలించిన వైద్య నిపుణులు.. ఆయనకు దాదాపు నెల రోజులు కంప్లీట్ రెస్ట్ అవసరం చెప్పారట. దీంతో వైజాగ్ షెడ్యూల్ కాన్సిల్ చేసి, ఈ సినిమా షూటింగ్ నెల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారట దర్శకనిర్మాతలు. అయితే ఈ ఇన్సిడెంట్ పై అధికారిక సమాచారం బయటకు చెప్పక పోవడం గమనార్హం.

    సమంత.. ఓ బేబీ

    సమంత.. ఓ బేబీ

    సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓ బేబీ' సినిమాలో కూడా నాగ శౌర్య నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయింది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ లో నాగ సూర్య, సమంత అభినయం పట్ల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 5న ఓ బేబీ విడుదల కానుంది.

    English summary
    Naga Shaurya's IRA Creations now doing third project. In this movie hero as Naga Shaurya. On the sets of Vizag location Naga Shaurya injured in shooting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X